INDvsENG: కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన టీమిండియా... కీలకంగా ఆఖరి రోజు ఆట...

Published : Aug 07, 2021, 11:54 PM IST

ఇంగ్లాండ్, ఇండియా మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకి ఆలౌట్ కావడంతో 209 పరుగుల టార్గెట్‌తో బరిలో టీమిండియా... ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది...

PREV
17
INDvsENG: కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన టీమిండియా... కీలకంగా ఆఖరి రోజు ఆట...

తొలి వికెట్‌కి 34 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. 38 బంతుల్లో 6 ఫోర్లతో 26 పరుగులు చేసి దూకుడు మీద ఉన్నట్టు కనిపించిన కెఎల్ రాహుల్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

27

కెఎల్ రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఛతేశ్వర్ పూజారా, తన స్టైల్‌కి విరుద్ధంగా మొదటి నుంచి క్లాస్ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు... 

37

రోహిత్ శర్మ 34 బంతుల్లో బౌండరీలు లేకుండా 12 పరుగులు చేస్తే, ఛతేశ్వర్ పూజారా 13 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేయడం విశేషం...

47

లక్ష్యానికి ఇంకా 161 పరుగుల దూరంలో ఉంది టీమిండియా. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. అయితే నాటింగ్‌హమ్‌లో ఇప్పటిదాకా నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు 208 పరుగులే. టీమిండియా ఆ రికార్డు బ్రేక్ చేయగలిగితే, తొలి టెస్టులో విజయం సాధించగలుగుతుంది...

57

అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 303 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.  ఓవర్‌నైట్ స్కోరు 25/0 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టును కెప్టెన్ జో రూట్ సెంచరీతో ఆదుకున్నాడు. 

67

తొలి ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయిన డొమినిక్ సిబ్లీ 28 పరుగులు చేయగా, జానీ బెయిర్ స్టో 50 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. డానియల్ లారెన్స్ 25 పరుగులు, సామ్ కుర్రాన్ 32 పరుగులు చేశారు.

77

172 బంతుల్లో 14 ఫోర్లతో 109 పరుగులు చేసిన జో రూట్, టెస్టుల్లో 21వ సెంచరీని అందుకున్నాడు. భారత బౌలర్లలో  బుమ్రాకి ఐదు వికెట్లు దక్కగా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది... 

click me!

Recommended Stories