INDvsENG: రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్... టీమిండియా ముందు..

Published : Aug 07, 2021, 10:22 PM IST

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 303 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 95 పరుగుల ఆధిక్యం తీసివేయగా 208 పరుగుల లక్ష్యం టీమిండియా ముందు ఉంచింది. ఇంకో రోజు ఆట మిగిలే ఉండడంతో ఈ మ్యాచ్ ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది.  

PREV
16
INDvsENG: రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్... టీమిండియా ముందు..

ఓవర్‌నైట్ స్కోరు 25/0 వద్ద బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు రోరీ బర్న్స్ వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌ను సిరాజ్ అవుట్ చేయగా జాక్ క్రావ్లీనా బుమ్రా అవుట్ చేశాడు. 

26

డొమినిక్ సిబ్లీ 28 పరుగులు చేయగా, జానీ బెయిర్ స్టో 50 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. డానియల్ లారెన్స్ 25 పరుగులు చేయగా బట్లర్ 17 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా జో రూట్ సెంచరీతో చెరలేగాడు.  

36

159 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ మార్కును అందుకున్న జో రూట్ 172 బంతుల్లో 109 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

46

45 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేసిన సామ్ కుర్రాన్‌ను బుమ్రా అవుట్ చేయగా ఆ తర్వాతి బంతికే స్టువర్ట్ బ్రాడ్‌ను అవుట్ చేసిన జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 

56

12 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన ఓల్లీ రాబిన్‌సన్‌ను షమీ అవుట్ చేయడంతో 303 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

66

భారత బౌలర్లలో బుమ్రాకి ఐదు వికెట్లు దక్కగా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది... 

click me!

Recommended Stories