INDvsENG: చనిపోయిన వ్యక్తి కోసం సీటు రిజర్వు చేసిన ఫ్రెండ్స్... కారణం ఏంటంటే...

First Published Aug 4, 2021, 7:02 PM IST

క్రికెట్‌కి పుట్టినిల్లు ఇంగ్లాండ్. టీమిండియాలో క్రికెట్‌కి క్రేజ్ ఎంతున్నా, టెస్టు మ్యాచులను చూడడానికి జనాలు పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే ఇంగ్లాండ్‌లో అయితే పరిస్థితి వేరు. టీ20ల కంటే టెస్టులకే ప్రాధాన్యం ఇస్తారు ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో జరుగుతున్న తొలి టెస్టు చూడడానికి ఏకంగా 80 వేలకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. 

చాలా కాలం తర్వాత స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయి కళకళలాడింది... అయితే ప్రేక్షకులతో నిండిన స్టేడియంలో ఓ సీటు మాత్రం ఖాళీగా కనిపించింది. 

అక్కడ ఎవ్వరైనా కూర్చుందామని ప్రయత్నించినా, దానికి అటు, ఇటూ ఉన్న వ్యక్తులు, కూర్చోకుండా అడ్డుకున్నారు...

కారణం ఏంటంటే ఈ ఖాళీ సీటును ఓ చనిపోయిన వ్యక్తి కోసం రిజర్వు చేశారు. జాన్ క్లార్క్ అనే క్రికెట్ ఫ్యాన్, ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగే ప్రతీ క్రికెట్ మ్యాచ్‌కి హాజరయ్యేవాడు...

ఇలా 40 ఏళ్లలో ఇక్కడ జరిగిన ప్రతీ మ్యాచ్‌కి హాజరయ్యాడు జాన్ క్లార్క్. అయితే ఈ మధ్యనే క్లార్క్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణం జరుగుతున్న తొలి టెస్టు ఇదే...

క్లార్క్ ప్రాణాలతో లేకపోయినా అతని గుర్తుగా, తన స్నేహితులు ఓ సీటును రిజర్వు చేశారు. తమ స్నేహితుడు లేకపోయినా, అతను లేకుండా ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో మ్యాచ్ చూడలేమని... ఈ సీటులో తను ఉన్నట్టుగానే భావిస్తున్నట్టు తెలిపారు క్లార్క్ ఫ్రెండ్స్...

click me!