ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 278 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్, రవీంద్ర జడేజా మాస్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా ఆఖర్లో బుమ్రా మెరుపులతో భారత జట్టుకి మొదటి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యం దక్కింది...
ఓవర్‌నైట్ స్కోర్ 125/4 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకి మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అయితే బ్రేక్ తర్వాత ఆటను ప్రారంభించిన టీమిండియా త్వరగానే పంత్ వికెట్ కోల్పోయింది.
213
తన స్టైల్‌కి తగ్గట్టుగానే 20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, రాబిన్‌సన్ ఓవర్‌లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
313
కెఎల్ రాహుల్ వికెట్ కోసం ఎంతగానో ప్రయత్నించిన ఇంగ్లాండ్ జట్టు, స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో రివ్యూకి వెళ్లింది. రిప్లైలో రాహుల్ బ్యాటుకి బాల్ తగలడం లేదని కనిపించడంతో ఇంగ్లాండ్ మూడు రివ్యూలను కోల్పోయింది...
413
రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ కలిసి ఆరో వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 53 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన జడేజా... టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు...
513
అత్యంత వేగంగా 2000 పరుగులు, 200+ వికెట్లు పడగొట్టిన భారత ఆల్‌రౌండర్‌గా కపిల్‌దేవ్, రవిచంద్రన్ అశ్విన్ తర్వాతి స్థానంలో నిలిచిన జడ్డూ, ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు....
613
రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెఎల్ రాహుల్ సెంచరీ ముగింట పెవిలియన్ చేరాడు. 214 బంతుల్లో 12 ఫోర్లతో 84 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
713
రాహుల్ వికెట్ తీసిన అండర్సన్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అనిల్ కుంబ్లేని అధిగమించాడు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ మాత్రం అండర్సన్ కంటే ముందున్నారు...
813
6 బంతులు ఆడిన శార్దూల్ ఠాకూర్ కూడా పరుగులేమీ చేయకుండానే అండర్సన్ బౌలింగ్‌లోనే జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 205 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా...
913
శార్దూల్ ఠాకూర్ అవుటైన తర్వాత దూకుడు పెంచిన రవీంద్ర జడేజా 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజాకి ఇది టెస్టుల్లో 16వ హాఫ్ సెంచరీ...
1013
86 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, రాబిన్‌సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, స్టువర్ట్ బ్రాడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
1113
20 బంతుల్లో 13 పరుగులు చేసిన మహ్మద్ షమీని రాబిన్‌సన్ క్లీన్‌బౌల్డ్ చేయగా... బుమ్రా, సిరాజ్ కూడా బౌండరీలు బాదడంతో టీమిండియా స్కోరు 260+ పరుగులు దాటింది.
1213
బుమ్రా 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేయగా సిరాజ్ 8 బంతుల్లో 7 పరుగులు చేశాడు. బుమ్రాకి టెస్టుల్లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. సిరాజ్, బుమ్రా కలిసి 10వ వికెట్‌కి 33 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.
1313
ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్‌కి నాలుగు వికెట్లు దక్కగా, ఓల్లీ రాబిన్‌సన్ ఐదు వికెట్లు తీశాడు...