తీరుమారని కోహ్లీ.. టెస్టుల్లో అదే వైఫల్యం.. నాగ్‌పూర్‌లోనూ కొనసాగింపు..

Published : Feb 10, 2023, 01:34 PM IST

INDvsAUS 1st Test Live: టీమిండియా వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తిరిగి  మునపటి ఫామ్ ను అందుకున్నా  టెస్టులలో మాత్రం వైఫల్యాలను వీడటం లేదు.  టెస్టులలో  అతడు సెంచరీ చేసి నాలుగేండ్లు కావస్తోంది. 

PREV
16
తీరుమారని కోహ్లీ.. టెస్టుల్లో అదే వైఫల్యం.. నాగ్‌పూర్‌లోనూ కొనసాగింపు..

2019 నవంబర్ 22 ..   టీమిండియా  మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్టులలో చివరిసారి సెంచరీ చేసిన తేదీ అది. బంగ్లాదేశ్ తో కోల్కతా లో అతడు శతకం బాదాడు. ఆ తర్వాత మూడేండ్ల పాటు  అత్యంత  దారుణ వైఫల్యాలతో సతమతమైన  ఈ పరుగుల యంత్రం గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్ లో మునపటి ఫామ్ ను అందుకున్నాడు. జూన్ లో ఇంగ్లాండ్  టూర్ తర్వాత నెల రోజుల పాటు విరామం తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్ లో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. 

26

ఆసియా కప్ తర్వాత స్వదేశంలో ఆసీస్, సౌతాఫ్రికా సిరీస్, టీ20 వరల్డ్ కప్ లలో కోహ్లీ జైత్రయాత్ర కొనసాగింది.  గతేడాది బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత శ్రీలంకపై బ్యాట్ కు బ్యాక్ సెంచరీలు బాదాడు.  పరిమిత ఓవర్లలో మళ్లీ ఫామ్ అందుకుని  ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారిన కోహ్లీ  టెస్టులలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. 

36

గత డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో  టెస్టులు ఆడిన కోహ్లీ..  రెండు టెస్టులలోనూ విఫలమయ్యాడు. తొలి టెస్టులో 1, 19 పరుగులు చేసిన  ఈ రన్ మిషీన్.. రెండో టెస్టులో కూడా 24, 1  రన్స్ మాత్రమే చేసి విఫలమయ్యాడు.  తాజాగా నాగ్‌‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  కూడా కోహ్లీ.. రెండు ఫోర్లు కొట్టి జోరు మీదే కనిపించినా.. 26 బంతుల్లో  12 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.  

46

ఈ మ్యాచ్ లో భారత్ ను కంగారు పెడుతున్న   యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ వేసిన  52వ ఓవర్  తొలి బంతికి  కోహ్లీ.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కి క్యాచ్ ఇచ్చాడు. లంచ్ తర్వాత తొలి బంతికే  కోహ్లీ పెవిలియన్ చేరాడు.  ఒకవైపు రోహిత్ ఒక్కోపరుగు కూడబెట్టి సెంచరీ  చేస్తే  కోహ్లీ మాత్రం బాధ్యతారాహిత్యంగా ఆడి ఔటవడంపై  టీమిండియా ఫ్యాన్స్ అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

56

గడిచిన పది టెస్టులలో కోహ్లీ ప్రదర్శనలు చూస్తే అతడు ఈ ఫార్మాట్ లో ఎంతగా ఇబ్బందులుపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.  బంగ్లాదేశ్ తో రెండు టెస్టులలో కలిపి  45 (24, 1, 1, 19) ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో 11, 20, శ్రీలంకతో రెండు టెస్టులలో 23, 13, 45, సౌతాఫ్రికాతో రెండు టెస్టులలో వరుసగా 79, 29, 35, 18 రన్స్ చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్ తో  టెస్టులో 0, 36  పరుగులు మాత్రమే చేసి పెవిలియన్   చేరాడు. 

66

ఇదే కోహ్లీ గడిచిన పది టీ20 ఇన్నింగ్స్ ను చూస్తే మాత్రం అతడు ఏ  రేంజ్ లో రెచ్చిపోతున్నాడో  తెలిసిపోతుంది.  కోహ్లీ గత పది ఇన్నింగ్స్ లలో స్కోర్లు వరుసగా.. 50, 26, 64, 12, 62, 82, 49,  3, 63, 11 గా ఉన్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories