IND vs BAN: బంగ్లాపై గెలుపుతో ఇండియా సెమీస్ త‌లుపులు తెరుచుకుంటాయ్ !

Published : Feb 20, 2025, 08:27 PM IST

India vs Bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో త‌మ తొలి మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని భార‌త క్రికెట్ జ‌ట్టు బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డింది.  ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టింది. సెమీస్ కు మరో అడుగు ముందుకేసింది.    

PREV
15
IND vs BAN: బంగ్లాపై గెలుపుతో ఇండియా సెమీస్ త‌లుపులు తెరుచుకుంటాయ్ !

IND vs BAN:  భార‌త జ‌ట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో రోహిత్ అండ్ కంపెనీ బంగ్లాదేశ్‌తో బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్‌లో భార‌త్ త‌న మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా భారత జట్టు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2013 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది.

25
Rohit Sharma

భారత్ ఏ దేశాల‌తో మ్యాచ్ లు ఆడ‌నుంది? 

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశలో భారత జట్టు మూడు జట్లతో తలపడనుంది. గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ మూడు జట్లతో భారత్ ఒక్కో మ్యాచ్ ఆడ‌నుంది. గ్రూప్‌లో టాప్-2 జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఒక్క ఓటమి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనే వారి కలను చెదరగొడుతుందని రోహిత్ సేన‌కు తెలుసు. అందుకే ప్ర‌తి మ్యాచ్ ను గెలుచుకోవాల‌ని టోర్నీలోకి అడుగుపెట్టింది. 

35
India vs Bangladesh Azar Patel

సూప‌ర్ ఫామ్‌లో టీమిండియా 

ప్రస్తుతం భారత జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో గెలుచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించి సెంచరీలు సాధించారు. వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ నుండి అర్ధ సెంచరీ కనిపించింది. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. బంగ్లాతో జ‌రిగిన తొలి మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ‌, గిల్ లు మంచి ట‌చ్ లో ఇన్నింగ్స్ ల‌ను ఆడారు.

45
Mohamed Shami

బంగ్లాదేశ్‌ను భారత్ ఓడిస్తే టోర్నీలో ముంద‌డుగు 

ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌ను ఓడించగలిగితే, భార‌త జ‌ట్టు సెమీఫైనల్స్‌కు చేరుకోవడానికి త‌ల‌పులు తెరుచుకుంటాయి. దీని త‌ర్వాత భార‌త జ‌ట్టు  పాకిస్తాన్, న్యూజిలాండ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్ బెర్త్ ఖాయం. ఈ మ్యాచ్‌లు వరుసగా ఫిబ్రవరి 23, మార్చి 3 తేదీలలో జరుగుతాయి. భారత జ‌ట్టు పాకిస్థాన్‌ను ఓడించినా లేదా పాక్ టీమ్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినా రోహిత్ శర్మ జట్టు సెమీఫైనల్‌కు చేరుకునే ఛాన్స్ ఉంటుంది. 

55

భారత్ పనిని ఈజీ చేసిన పాకిస్తాన్ !

టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. దీనిలో ఆతిథ్య జట్టు పాక్ 60 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి భారత్ సెమీఫైనల్ చేరుకోవడానికి మార్గాన్ని సులభతరం చేసింది. ఎందుకంటే ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌పై, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌పై విజయం సాధిస్తే భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించడం దాదాపుగా ఖాయం అవుతుంది. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయినా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటిపై గెలిస్తే సెమీఫైనల్స్‌కు చేరుకునే అవకాశం లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories