KL Rahul: 14 ఏండ్ల రికార్డు బ్రేక్.. ధోని త‌ర్వాత కేఎల్ రాహుల్..

First Published | Dec 22, 2023, 10:36 AM IST

KL Rahul Records: స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వ‌న్డేల‌లో కేవలం 24 ఇన్నింగ్స్‌లలో 1060 పరుగులతో సంచల‌నం న‌మోదుచేశాడు. దిగ్గ‌జ ప్లేయ‌ర్, భార‌త జ‌ట్టు మాజీ సార‌థి ఎంఎస్ ధోని తర్వాత ఒక క్యాలెండర్ ఇయ‌ర్ లో వ‌న్డేల‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ భారత వికెట్ కీపర్ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.
 

KL Rahul

KL Rahul breaks Dhoni's record: భార‌త వ‌న్డే జ‌ట్టు కెప్టెన్, కీప‌ర్ కేఎల్ రాహుల్ మ‌రో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. 14 ఏళ్ల తర్వాత వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 1000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మ‌న్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్, మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ (ఎంఎస్ ధోనీ) త‌ర్వాత‌ ఘ‌నత సాధించిన రెండో భార‌త ప్లేయ‌ర్ గా నిలిచాడు.
 

KL Rahul

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన చివ‌రి, మూడో వ‌న్డేలో కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలోనే మ‌రో మైలురాయిని అందుకున్నాడు. 2023లో వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. 
 


KL Rahul

31 ఏళ్ల బ్యాటర్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో 1000 ప్లస్ పరుగులు చేసిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును స‌మం చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ధోని 2009లో 1198 పరుగులు, 2008లో 1098 పరుగులు చేశాడు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాతకేఎల్ రాహుల్ భార‌త వికెట్ కీప‌ర్ గా ఒక ఏడాది వేయి పరుగులు పూర్తి  చేసిన ప్లేయ‌ర్ గా రికార్డు సృష్టించాడు. 

KL Rahul

రాహుల్ 2023లో 24 వ‌న్డే ఇన్నింగ్స్‌లలో 66.25 సగటుతో 1060 పరుగులు సాధించాడు. ఈ ఈన్నింగ్స్ ల‌లో  ఇప్పటివరకు రెండు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐసీసీ ప్రపంచ కప్ 2023లో 10 ఇన్నింగ్స్‌లలో 452 పరుగులతో ఆకట్టుకున్నాడు. 2023లో వ‌న్డేల‌లో 1000 పరుగుల మార్క్‌ను చేరుకున్న నాల్గవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. 
 

KL Rahul

2023లో అత్యధిక  వ‌న్డే ప‌రుగులు చేసిన భార‌త క్రికెట‌ర్లు:

శుభ్‌మన్ గిల్ - 29 ఇన్నింగ్స్‌ల్లో 1584 పరుగులు
విరాట్ కోహ్లీ - 24 ఇన్నింగ్స్‌ల్లో 1377 పరుగులు
రోహిత్ శర్మ - 26 ఇన్నింగ్స్‌ల్లో 1255 పరుగులు
కేఎల్ రాహుల్ - 24 ఇన్నింగ్స్‌ల్లో 1060 పరుగులు
శ్రేయాస్ అయ్యర్ - 19 ఇన్నింగ్స్‌ల్లో 846 పరుగులు

Latest Videos

click me!