Year Ender 2023: ఇయర్ ఆఫ్ ది కింగ్.. విరాట్ కోహ్లీ !

First Published | Dec 21, 2023, 6:18 PM IST

Virat Kohli: ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును విరాట్ కోహ్లీ బద్దలుకొట్టాడు. 2023 ప్రపంచకప్ లో ఎనిమిదో క్యాలెండర్ ఇయర్ లో 1000 వన్డే పరుగుల మైలురాయిని విరాట్ కోహ్లీ అందుకున్నాడు.
 

Virat Kohli, India, cricket

Year of King Virat Kohli: దాదాపు రెండు సంవత్సరాల పాటు పెద్ద‌గా ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న స‌మ‌యంలో అన్ని ఫార్మాట్లలో భారత జట్టులో తన స్థానాన్ని చాలా మంది ప్రశ్నించిన తర్వాత.. భార‌త స్టార్ బ్యాట్స్ మ‌న్ విరాట్ కోహ్లీ... 2023 త‌న విశ్వ‌రూపం చూపించాడు. త‌న అద్భుత ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించాడు. తిరుగులేని రికార్డులు న‌మోదుచేశాడు. 
 

Virat Kohli, India, cricket

గత ఏడాది చివరి దశలో సెంచరీ కరువుకు తెరదించుతూ రికార్డు స్థాయి పరుగులకు నాంది పలికిన కోహ్లీకి 2023 త‌న విధ్వంసం కొన‌సాగించి ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) గా నిలిచాడు. ఐపీఎల్లో 2, టెస్టుల్లో 2, వన్డేల్లో 6 సెంచరీలు చేసిన కోహ్లీ 2023లో అసాధ్యమైన రికార్డును బద్దలు కొట్టాడు. ఇయ‌ర్ ఆఫ్ ది కింగ్, ఇయ‌ర్ ఆఫ్ ది క్రికెట్ కింగ్ గా నిలిచాడు. 
 


Virat Kohli, India, cricket

వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు

ఒక దశాబ్దం క్రితం, సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం అనిపించిది. కానీ ఈ ఏడాది నవంబర్ 15 న వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్లో, కోహ్లీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 50 వన్డే సెంచరీలు సాధించిన మొదటి ప్లేయ‌ర్ గా ఘ‌నత సాధించాడు. 
 

Virat Kohli, India, cricket

ఒక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు

ఒక ఐసీసీ వ‌న్డే క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డును న‌మోదుచేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో కోహ్లీ 11 మ్యాచ్ ల‌లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో 2003 వన్డే వరల్డ్ క‌ప్ లో 673 పరుగులు చేసిన సచిన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. త‌న బ్యాట్ తో అద‌ర‌గొట్టిన విరాట్ కోహ్లీ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.
 

Virat Kohli, India, cricket

ఒక వన్డే ప్రపంచకప్ లో అత్యధిక ఆఫ్ సెంచ‌రీలు

2003 వన్డే వరల్డ్ క‌ప్ లో సచిన్ టెండూల్కర్ (7 హాఫ్ సెంచరీలు), 2019 వరల్డ్ క‌ప్ లో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ (7 హాఫ్ సెంచరీలు) తర్వాత ఒకే వరల్డ్ క‌ప్ ఎడిషన్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
 

Virat Kohli, India, cricket

వన్డేల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు

ఈ ఏడాది ఆసియా కప్ లో పాకిస్థాన్ పై 122 పరుగులు చేసి.. కేవలం 267 ఇన్నింగ్స్ ల్లోనే 13000 వన్డే పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 292 వన్డేలాడిన విరాట్ 50 సెంచరీలు, 72 అర్ధసెంచరీలతో 58.97 సగటుతో 13848 పరుగులు చేశాడు.
 

Virat Kohli, India, cricket

ఒక క్యాలెండర్ ఇయర్ వన్డేల్లో అత్యధిక సార్లు 1000 పరుగులు

ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన మరో మైలురాయిని కోహ్లీ అధిగమించాడు. 2023 ప్రపంచకప్ లో ఎనిమిదో క్యాలెండర్ ఇయర్ లో 1000 వన్డే పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
 

Virat Kohli, India, cricket

అత్యధిక ఐపీఎల్ సెంచరీలు

ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రెండు సెంచరీలతో, కోహ్లీ తన సెంచరీల సంఖ్యను 7 కు చేర్చాడు. దీంతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (6 సెంచరీలు) ను అధిగమించి అత్యధిక ఐపీఎల్ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మ‌న్ గా నిలిచాడు.
 

Virat Kohli, India, cricket

ఐపీఎల్ లో 7000 పరుగులు పూర్తి చేసిన మొద‌టి ప్లేయ‌ర్.. 

ఈ ఏడాది ప్రారంభంలో ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఐపీఎల్ లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 229 ఇన్నింగ్స్ ల‌లో 37.24 సగటు, 130కి పైగా స్ట్రైక్ రేట్ తో 7263 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 50 అర్ధసెంచరీలు చేయ‌గా, ఇందులో 113 అత్యుత్తమ స్కోరు. 
 

Latest Videos

click me!