అనేక సమస్యలతో అసాధారణ విజయం సాధించారు... టీమిండియాపై ప్రధాని మోదీ మన్‌కీ బాత్...

First Published | Jan 31, 2021, 4:29 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో అనేక సమస్యలకు, ప్లేయర్ల గాయాలకు ఎదురొడ్డి అద్భుత విజయాన్ని సాధించింది టీమిండియా. టెస్టు సిరీస్ విజయం తర్వాత భారత జట్టుకు అభినందనలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, మరోసారి మన్‌కీ బాత్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు...

‘ఈ నెలలో క్రికెట్ పిచ్ నుంచి కూడా మనకి గుడ్ న్యూస్ వచ్చింది... మన క్రికెట్ జట్టు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచింది.
అనేక సమస్యలకు ఎదురొడ్డి, హర్డ్ వర్క్, టీమ్ వర్క్‌తో మన ప్లేయర్లు సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిదాయకమైనది...’ అంటూ మన్‌కీ బాత్‌లో మాట్లాడారు నరేంద్ర మోదీ...

మోదీ వ్యాఖ్యలకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఆస్ట్రేలియాలో భారత జట్టు ప్రదర్శనను, కష్టాన్ని గుర్తించిన గౌరవనీయులైన ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు అంటూ కామెంట్ పెట్టాడు గంగూలీ...
‘సార్ జీ... భారత జట్టు ప్రదర్శనను గుర్తించినందుకు ధన్యవాదాలు... మనమంతా కలిసి పని చేసి, దేశం గర్వపడేలా చేద్దాం’ అంటూ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ట్వీట్ చేశాడు...
‘ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. ఆస్ట్రేలియాలో మన టీమిండియా చేసి చూపించింది ఇదే...’ అంటూ భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు...
‘థ్యాంక్ యూ సర్... మీ విలువైన ప్రశంసలు మాకు భవిష్యత్తులో మరింత సాధించడానికి బలాన్ని ఇస్తాయి. అనేక సమస్యలకు ఎదురొడ్డి, ఒత్తిడి నుంచి బయటపడేందుకు, పరిష్కారం కనుగొనేందుకు ఎనర్జీని ఇస్తాయి...’ అంటూ భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్ చేశాడు...
సీనియర్లు లేకుండా, కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా ఆస్ట్రేలియాను గబ్బా టెస్టులో ఓడించి, 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా...
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో కలిసి స్వదేశంలో సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ జట్టు. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు మ్యాచులు టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

Latest Videos

click me!