ఢిల్లీలో 71 రోజులుగా జరుగుతున్న రైతుల నిరసన దీక్షలకు మద్ధతుగా అమెరికన్ పాప్ సింగర్ రిహానా వేసిన ట్వీట్ పెను సంచలనం క్రియేట్ చేసింది.

భారత మాజీ క్రికెటర్ ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్, ఈ విషయంలో బయటివాళ్లు తలదూర్చాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ‘మనమందరం సమైక్యంగా వుండాలని, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలగకూడదన్నారు. బయటి శక్తులు ప్రేక్షకుల మాదిరిగానే ఉండాలని, భారత అంతర్గత వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోకూడదని సచిన్ తేల్చి చెప్పారు. భారత్ కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని చెప్పారు టెండూల్కర్...

భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, అజింకా రహానే వంటి మిగిలిన ప్లేయర్లు ఆయన్ని అనుసరించారు. అయితే ఇద్దరు క్రికెటర్లు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన ట్వీట్లు వేశారు...

సచిన్ టెండూల్కర్ ‘అంతర్గత విషయాల’ ట్వీట్ తర్వాత సోషల్ మీడియాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.

సచిన్, ప్రభుత్వం తరుపున బ్యాటింగ్ చేస్తున్నాడంటూ, రైతులు అతనికి ప్రత్యర్థి వైపు ఉన్నారని ఓ రేంజ్‌లో యుద్ధవాతావరణం కనిపిస్తోంది ట్విట్టర్, అండ్ సోషల్ మీడియాలో...

భారత క్రికెటర్ మనోజ్ తివారి వేసిన ఓ ట్వీట్ సంచలనం క్రియేట్ చేస్తోంది.

‘నేను చిన్నప్పటి నుంచి తోలుబొమ్మలాట ఎప్పుడూ చూడలేదు... దాదాపు 35 ఏళ్ల తర్వాత ఇప్పుడే మొదటిసారి చూస్తున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు మనోజ్ తివారి.

ప్రభుత్వం చెప్పినట్టే క్రికెటర్లు, సెలబ్రిటీలు అందరూ ఆడుతున్నారనే ఉద్దేశంతోనే మనోజ్ తివారి ఈ ట్వీట్ వేశాడనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది.

ఈ ట్వీట్‌తో సచిన్, కోహ్లీలను కూడా పరోక్షంగా విమర్శించాడు పశ్చిమ బెంగాల్‌కి చెందిన మనోజ్ తివారి...

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ కూడా సచిన్ వేసిన ‘అంతర్గత విషయాల’ ట్వీట్‌కు షాకింగ్ రిప్లై ఇచ్చాడు...

అంతర్గత విషయాలని గిరి గీసుకుని కూర్చుని ఉంటే... ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతున్నా మనకెందుకులే అని వదిలేయాల్సి ఉంటుందని...’ ఇన్‌స్టాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టి, ట్వీట్టర్‌లో కూడా షేర్ చేశాడు సందీప్ శర్మ.

అయితే కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేశాడు సందీప్. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సందీప్ శర్మ, రైతులకు మద్ధతు చేస్తున్నట్టు చాలాసార్లు ప్రకటిస్తూ పోస్టులు చేశాడు.

పంజాబ్‌కి చెందిన గురుకీరట్ సింగ్ మాన్ కూడా రైతుల దీక్షకు మద్ధతు ప్రకటించాడు. తన తండ్రితో పాటు రైతుల నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు...

71 రోజులుగా సాగుతున్న రైతుల ఉద్యమానికి త్వరగా ఓ పరిష్కారం రాకపోతే, ఈ సమస్య క్రికెట్‌ను కూడా రెండుగా చీల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు... ఇప్పటికే ఈ విషయంలో ట్వీట్ చేయడం లేదని ధోనీని కూడా ఇందులోకి లాగుతున్నారు కొందరు నెటిజన్లు.