టీమ్‌లో అతని స్థానం మారదు, కెప్టెన్ కాకపోయినా... కోహ్లీ గురించి రోహిత్ శర్మ కామెంట్...

First Published Nov 17, 2021, 3:50 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. ఎమ్మెస్ ధోనీ నుంచి టీమిండియా కెప్టెన్సీ తీసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఆ బాధ్యతలను అప్పగించి, ఆ స్థానం నుంచి తప్పుకోబోతున్నాడు...

విరాట్ కోహ్లీ మోస్ట్ అగ్రెసివ్ కెప్టెన్ అయితే, రోహిత్ శర్మ చాలా కూల్ అండ్ కామ్ పర్సన్. ఒకరు నిప్పు అయితే, మరొకరు నీరు... ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది...

అగ్రెసివ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో రోహిత్ శర్మ, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి కూల్ ప్లేయర్లు ఆడడం పెద్ద కష్టమేమీ కాదు, ఇబ్బందేమీ ఉండదు..

అయితే తన కెప్టెన్సీలో ఆడిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ సర్దుకోగలడా? అనేది ఇప్పుడు ఆత్యంత ఆసక్తికరంగా మారింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కోహ్లీ కెప్టెన్‌గా కాకుండా ఓ ప్లేయర్‌గా మాత్రమే సర్దుకోపోగలడా? అనేది తేలాల్సి ఉంది...

‘విరాట్ కోహ్లీ జట్టుకి చాలా విలువైన ఆటగాడు. అతను తన ఆటతో మిగిలిన ప్లేయర్లను కూడా ప్రభావితం చేయగలడు. జట్టుకి అతని అవసరం ఎంతో ఉంది...

కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, టీమ్‌లో అతని స్థారం మారదు. టీ20ల్లో కెప్టెన్ కాకపోయినా అన్ని ఫార్మాట్లలోనూ అతనో కీలకమైన ఆటగాడు. దాన్ని ఎవ్వరూ కాదనలేరు...

ప్రతీ మ్యాచ్‌కీ రోల్స్ మారుతూ ఉంటాడు. మొదట బ్యాటింగ్ చేస్తుంటే ప్లేయర్లను ఒకలా, రెండోసారి బ్యాటింగ్ చేస్తే మరోలా ఆటగాళ్లను వాడుకోవాల్సి ఉంటుంది...

పరిస్థితులను బట్టి అందరి రోల్స్ మారుతూ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత మా జట్టు మరింత బలంగా తయారవుతుంది.

ఎందుకంటే అతనికి అపారమైన అనుభవం ఉంది. అతనో అద్భుతమైన బ్యాట్స్‌మెన్... విరాట్ కోహ్లీకి నా టీమ్‌లో ఎప్పుడూ చోటు ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

ఇంగ్లాండ్ టూర్, ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలతో యమ బిజీగా గడిపిన విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు...

టీ20 కెప్టెన్‌గా న్యూజిలాండ్ సిరీస్‌తో బాధ్యతలు అందుకోబోతున్న రోహిత్ శర్మ, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టెస్టు సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకోనున్నాడు...

న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ తొలిసారి బరిలో దిగే అవకాశం ఉంది..

click me!