విరాట్ కోహ్లీ, తొలి టెస్టులో అంపైర్లను భయపెట్టాలని చూశాడు... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణ...

Published : Feb 09, 2021, 04:29 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 227 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. 420 పరుగుల భారీ లక్ష్యచేధనలో భారత సారథి విరాట్ కోహ్లీ, యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ ఒంటరి పోరాటం చేసినా, ఫలితం దక్కలేదు. ఇంగ్లాండ్‌తో పోలిస్తే, తమ జట్టు ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్, పోరాటం ఏ మాత్రం సరిపోలేదని ఒప్పుకున్నాడు కోహ్లీ. అయితే కోహ్లీపై సంచలన ఆరోపణలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్. 

PREV
18
విరాట్ కోహ్లీ, తొలి టెస్టులో అంపైర్లను భయపెట్టాలని చూశాడు... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణ...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్... తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, డబుల్ సెంచరీతో చెలరేగగా బెన్ స్టోక్స్ 82, సిబ్లీ 87 పరుగులు చేశారు. 190.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్.

28

మొదటి రెండు రోజులు పూర్తిగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, మూడో రోజు 10.1 ఓవర్ల తర్వాత ఆలౌట్ అయ్యింది. జో రూట్‌తో సహా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అందరూ (ఒకరిద్దరు మినహా) బ్యాటు ఝులిపించారు. దీంతో భారత బౌలర్లు వికెట్లు తీయడానికి తెగ ఇబ్బంది పడాల్సి వచ్చింది.

38

ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో భారత సారథి విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యారు. పలుమార్లు అవుట్ కోసం అప్పీలు చేసిన విరాట్ కోహ్లీ, రెండో రోజు 80 ఓవర్లలోనే మూడు రివ్యులను వాడి, వృథా చేసుకున్నాడు.. ఫలితంగా రెండో రోజు డీఆర్‌ఎస్ లేకుండానే బౌలింగ్ చేసింది టీమిండియా...

48

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అందరూ తడబడ్డారు. భారత బౌలర్లను ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక, 178 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ప్రవర్తన తనకి వింతగా అనిపించిందని ఆరోపణలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్.

58

‘భారత సారథి విరాట్ కోహ్లీ ప్రవర్తన నాకు వింతగా అనిపించింది. తొలి టెస్టు నాలుగో రోజు అతను చాలా అతిగా అప్పీలు చేశాడు. నాలుగో రోజు సెకండ్ సెషన్‌లో షాకింగ్ రివ్యూలు తీసుకున్నాడు. కోహ్లీ డీఆర్‌ఎస్ నిర్ణయాలపై కామెంటేటర్లు కూడా షాక్ అయ్యారు. కానీ నాకు విరాట్ కోహ్లీ ప్రవర్తన చూస్తుంటే, ఎలాగైనా తమకు అనుకూలంగా నిర్ణయాలు రావాలని కోహ్లీ చూస్తున్నట్టు ఉంది...

68

ఇలా మళ్లీ మళ్లీ అప్పీలు చేయడం వల్ల అంపైర్లు ఒత్తిడికి గురవుతాయి. ఒకసారి డీఆర్‌ఎస్‌లో నిర్ణయం మార్చుకోవాల్సి వస్తే, ఆ ప్రభావంతో తప్పుడు నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని విరాట్ కోహ్లీ ఇలా చేసినట్టు ఉంది...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు డేవిడ్ లాయిడ్.

78

కరోనా నిబంధనల కారణంగా 27 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌కు ఇద్దరు భారతీయ అంపైర్లు బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియా టూర్‌లో అంపైర్ల నిర్ణయాలు అనేకం వివాదాస్పదం కాగా... తొలి టెస్టులో కేవలం ఒకటి, రెండు నిర్ణయాలు మాత్రమే డీఆర్ఎస్ తర్వాత మార్చుకోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా అంపైర్ల కంటే అద్భుతంగా అంపైరింగ్ చేశారు తొలి టెస్టు అంపైర్లు.

88

విరాట్ కోహ్లీ అగ్రెసివ్ యాటిట్యూడ్ గురించి తెలిసినవాళ్లు ఎవ్వరైనా... తొలి టెస్టులో అతని ప్రవర్తనను అనుమానించరు. ఐపీఎల్‌తో సహా ప్రతీ మ్యాచ్‌లోనూ కాస్త అగ్రెసివ్‌గా అప్పీలు చేయడం విరాట్ కోహ్లీకి అలవాటు. ఆసీస్ టూర్‌లో రహానే కూల్ యాటిట్యూడ్‌ని చూసిన వారికి, విరాట్ ప్రవర్తన వింతగానే అనిపిస్తుంది...

click me!

Recommended Stories