Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !

Published : Jun 19, 2026, 08:13 AM IST

Women's T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ దూరం అయ్యారు. ఆమె స్థానంలో కొత్త ప్లేయర్ ప్రేమ రావత్ జట్టులోకి వచ్చింది.

PREV
15
టోర్నీ సూపర్ ఫామ్‌లో ఉన్న వేళ టీమిండియాకు ఊహించని షాక్

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో దూసుకుపోతున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఊహించని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ఆఫ్ స్పిన్నర్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమైంది. నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో శ్రేయాంక యాంకిల్ లిగమెంట్ కు తీవ్రంగా గాయం అయింది. దీంతో ఆమె ఈ మెగా టోర్నీలో ఇకపై ఆడలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

25
లైవ్‌లోనే కుప్పకూలిన శ్రేయాంక

లీడ్స్ లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. శ్రేయాంక పాటిల్ తన బౌలింగ్ స్పెల్‌లో కేవలం ఒకే ఒక్క బంతి వేసింది. ఆ తర్వాత మిడ్ ఆన్ రీజియన్‌ వైపు వచ్చిన బంతిని ఫీల్డింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆమె మడమ గట్టిగా తిరిగింది. తీవ్రమైన నొప్పితో ఆమె ఒక్కసారిగా గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయింది.

భారత జట్టు ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి పరీక్షించారు. అయితే, శ్రేయాంక తన కాలును పట్టుకుని నొప్పితో విలవిలలాడిపోయింది. కనీసం కాలు కింద పెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో, మెడికల్ స్టాఫ్ స్ట్రెచర్‌ తీసుకువచ్చి ఆమెను తీసుకెళ్లారు. ఆ వెంటనే ఆమెకు స్కానింగ్స్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు.

35
శ్రేయాంక పాటిల్ కు ఫిట్‌నెస్ దెబ్బలు

ఈ యంగ్ బౌలర్‌కు ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడటం ఇది మొదటిసారేం కాదు. గత కొన్ని ఏళ్లుగా ఆమె వరుస గాయాలతో ఇబ్బంది పడుతోంది. జూలై 2024లో చేతి వేలు విరగడంతో ఆ ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు దూరమైంది. ఆ తర్వాత రెండు కాళ్లలో షిన్ స్ప్లింట్స్, మణికట్టు సమస్యల వల్ల దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

అయితే, పట్టుదలతో కోలుకుని 2025 ఉమెన్స్ సీపీఎల్ ద్వారా కంబ్యాక్ ఇచ్చింది. అంతేకాదు, 2026 ప్రారంభంలో ఆర్సీబీ రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి ప్లేయర్ ఇప్పుడు మళ్లీ వరల్డ్ కప్ మధ్యలో గాయపడటం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.

45
రీప్లేస్‌మెంట్‌గా ప్రేమ రావత్ ఎంట్రీ

శ్రేయాంక పాటిల్ దూరం కావడంతో ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ టీమిండియా రీప్లేస్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్‌క్యాప్డ్ లెగ్ స్పిన్నర్, 24 ఏళ్ల ప్రేమ రావత్‌ను శ్రేయాంక స్థానంలో భారత సీనియర్ జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అనుష్క శర్మ కెప్టెన్సీలోని ఇండియా ఏ జట్టుతో కలిసి ప్రేమ రావత్ ఇంగ్లాండ్‌లోనే పర్యటిస్తోంది.

డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో ప్రేమ అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఆసియా కప్‌లో ఇండియా ఏ తరపున ఆడి కేవలం 9.62 సగటుతో 8 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో ఆమెకు ఈ బంపర్ ఆఫర్ దక్కింది.

55
సెమీస్ వేటలో హర్మన్‌ప్రీత్ సేన

ప్రస్తుత టోర్నీ విషయానికి వస్తే.. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై ఘన విజయాలు సాధించింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాంక 3 ఓవర్లలో 17 రన్స్ ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసింది. 

ఆమె లేకపోవడం లోటే అయినప్పటికీ, కొత్త స్పిన్నర్ ప్రేమ రావత్ జట్టుకు బలాన్ని ఇస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. భారత్ తన తదుపరి లీగ్ మ్యాచ్‌ల్లో బలమైన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ చేరడమే ఇండియా తర్వాతి టార్గెట్.

Read more Photos on
click me!

Recommended Stories