Inzamam-ul-Haq: మాతో మ్యాచ్ అనగానే భారత్ భయపడింది.. పాకిస్థాన్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్

First Published Nov 26, 2021, 3:05 PM IST

India Vs pakistan: కొద్దిరోజుల క్రితం  దుబాయ్ లో జరిగిన పొట్టి ప్రపంచకప్ లో  పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందే భారత్ భయపడిందని ఆ జట్టు మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ సంచలన  వ్యాఖ్యలు చేశాడు.  ఇండియా ఆటగాళ్లంతా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని కామెంట్స్ చేశాడు. 

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన  ఇండియా-పాకిస్థాన్ ల మధ్య అక్టోబర్ 24న మ్యాచ్ జరగగా.. ఆ పోరులో భారత్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఇదే విషయమై  పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమతో మ్యాచ్ కు ముందే  భారత్ భయపడిందని, అది ప్రతి భారత ఆటగాడి ముఖంలో కనిపించిందని చెప్పాడు. 

పాక్ కు చెందిన ఓ ఛానెల్ తో మాట్లాడిన ఇంజమామ్.. ‘పాకిస్థాన్ తో మ్యాచ్ కు  ముందే భారత ఆటగాళ్లకు భయం పట్టుకుంది. అది ప్రతి ఒక్క ఆటగాడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. కావాలంటే మీరు టాస్ నుంచే గమనించండి.

india vs pakistan toss

టాస్ సందర్భంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా సారథి విరాట్ కోహ్లి ని గమనించండి.. కోహ్లి ముఖంలో ఒత్తిడి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక రోహిత్ శర్మ అయితే తీవ్రమైన ఒత్తిడిలో కనిపించాడు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు ఔట్ అయిన తర్వాత ఆ జట్టు మొత్తం పూర్తి నిరాశతో కనిపించింది.

భారత జట్టుతో పోల్చితే పాకిస్థాన్ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపించారు. రోహిత్, రాహుల్ ఔట్ అయ్యాక మ్యాచ్ తమదే  అయిందన్న ధీమా వారిలో కనిపించింది. ఇక టోర్నీ హాట్ ఫేవరేట్లుగా వచ్చిన టీమిండియా.. పాక్ తో పరాభావంతో కాస్త సమయం దొరికినా పుంజుకోలేదు..’ అని ఇంజమామ్ అన్నాడు. 

‘పాక్ తో మ్యాచ్ తర్వాత భారత జట్టుకు వారం రోజుల టైమ్ దొరికింది. అయినా వాళ్లు దానిని సద్వినియోగం చేసుకోలేదు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కూడా ఆ జట్టుకు సరెండర్ అయ్యరు. ఇక  స్పిన్ ను భాగా ఆడగలరనే పేరున్న భారత ఆటగాళ్లు.. కివీ స్పిన్నర్లు శాంట్నర్, సోధి లను కూడా ఎదుర్కోలేక ఇబ్బందులు పడ్డారు..’ అని  వ్యాఖ్యానించాడు.

ఇంత దారుణంగా టీమిండియా మునుపెన్నడూ ఆడటం తాను చూడలేదని ఇంజమామ్ చెప్పాడు. టీ20లలో గత రెండు  మూడేండ్లుగా అద్భుతంగా రాణించిన భారత జట్టు.. టీ20 ప్రపంచకప్ టోర్నీ హాట్ ఫేవరెట్ గా వచ్చి సూపర్-12లోనే నిష్క్రమించడం నిరాశ కలిగించిందని చెప్పాడు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత వారిలో చాలా ఒత్తిడి పెరిగిపోయిందని అన్నాడు. 

కాగా.. టీ20 ప్రపంచకప్ లో  పాకిస్థాన్, న్యూజిలాండ్ తో ఓడిన భారత జట్టు.. ఆ తర్వాత ఆఫ్గనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాను ఓడించింది. అయినా అఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవడంతో కివీస్ ఫైనల్ కు వెళ్లింది. కానీ ఫైనల్లో ఆ జట్టు ఆసీస్ పై ఓడింది. ఆ తర్వాత భారత పర్యటనకు వచ్చి  టీ20 సిరీస్ ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. 

click me!