వృద్ధిమాన్ సాహాకి ఎన్ని ఛాన్సులిచ్చినా వృథానే... నాలుగేళ్లుగా కనీసం హాఫ్ సెంచరీ కూడా...

Published : Nov 26, 2021, 12:47 PM ISTUpdated : Nov 26, 2021, 12:49 PM IST

ఆడిలైడ్ టెస్టుకి ముందు వరకూ టెస్టుల్లో భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఉంటూ వచ్చాడు వృద్ధిమాన్ సాహా. రిషబ్ పంత్ ఎంట్రీతో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన సాహా, రాకరాక వచ్చిన అవకాశాలను కూడా ఒడిసిపట్టుకోలేకపోతున్నాడు...

PREV
113
వృద్ధిమాన్ సాహాకి ఎన్ని ఛాన్సులిచ్చినా వృథానే... నాలుగేళ్లుగా కనీసం హాఫ్ సెంచరీ కూడా...

2010లో టెస్టు ఆరంగ్రేటం చేసిన వృద్ధిమాన్ సాహా, ఎమ్మెస్ ధోనీ కారణంగా అప్పుడప్పుడూ తుదిజట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. మాహీ టెస్టు రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు...

213

38 టెస్టుల్లో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 1251 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, 92 క్యాచులు, 11 స్టంపౌట్లతో మంచి వికెట్ కీపర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు...

313

రిషబ్ పంత్ సంచలన ఎంట్రీతో మరోసారి సాహాకు గేట్లు మూసుకుపోయాయి. అయితే కెరీర్ ఆరంభంలో ఇచ్చిన అవకాశాలను రిషబ్ పంత్ సరిగా వినియోగించుకోలేకపోయాడు...

413

అటు టెస్టు, వన్డే, టీ20ల్లో విఫలమై, పూర్తిగా జట్టుకి దూరమయ్యే పరిస్థితికి వచ్చాడు. దీంతో వికెట్ కీపింగ్‌లో అదరగొట్టే వృద్ధిమాన్ సాహాకి వరుస అవకాశాలు ఇచ్చింది టీమిండియా...

513

2017 నుంచి 14 ఇన్నింగ్స్‌లు ఆడిన వృద్ధిమాన్ సాహా, 14.18 సగటుతో 156 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కోరు 29 పరుగులు మాత్రమే...

613

ఆసీస్ టూర్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సెంచరీ చేయడంతో, ఆడిలైడ్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో వృద్ధిమాన్ సాహా విఫలం కావడంతో మెల్‌బోర్న్ టెస్టు నుంచి భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్‌గా మారిపోయాడు రిషబ్ పంత్...

713

మెల్‌బోర్న్ టెస్టులో కొన్ని మెరుపులతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 30+ పరుగులు చేసిన పంత్, సిడ్నీ, గబ్బా టెస్టుల్లో బ్యాటింగ్‌లో అదరగొట్టి... వృద్ధిమాన్ సాహా ప్లేస్‌కి చెక్ పెట్టేశాడు...

813

ఆస్ట్రేలియా టూర్ తర్వాత జరిగిన ఇండియాలో జరిగిన ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో, ఇంగ్లాండ్ టూర్‌లో కూడా వృద్ధిమాన్ సాహాకి తుదిజట్టులో అవకాశం రాలేదు...

913

సిడ్నీ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ రిషబ్ పంత్ గాయపడడంతో వృద్ధిమాన్ సాహా వికెట్ కీపింగ్ చేశాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి పంత్ గాయం నుంచి కోలుకుని, బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు...

1013

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి రిషబ్ పంత్‌కి విశ్రాంతి ఇవ్వడంతో వృద్ధిమాన్ సాహాకి చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత టెస్టుల్లో బ్యాటింగ్‌కి వచ్చాడు సాహా...

1113

అయితే తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఆడిన వృద్ధిమాన్ సాహా, కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సాహా ఫెయిల్ అయితే ముంబై టెస్టులో అతనికి చోటు దక్కడం అనుమానమే...

1213

వరుసగా విఫలమవుతున్న వృద్ధిమాన్ సాహా స్థానంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న తెలుగు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్‌కి అవకాశం దక్కొచ్చు...

1313

ఒకవేళ ముంబై టెస్టులో శ్రీకర్ భరత్ ఎంట్రీ ఇచ్చి, తొలి టెస్టులో ఇంప్రెస్ చేస్తే... 37 ఏళ్ల సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా అంతర్జాతీయ కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడినట్టే అవుతుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

Read more Photos on
click me!

Recommended Stories