టీ20 సిరీస్‌కి ముందు టీమిండియా మరో షాక్... గాయంతో వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్...

Published : Feb 15, 2022, 11:29 AM IST

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌, గాయంతో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు...

PREV
19
టీ20 సిరీస్‌కి ముందు టీమిండియా మరో షాక్... గాయంతో వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్...

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో గాయపడిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కివీస్‌తో రెండో టెస్టుతో పాటు, సౌతాఫ్రికా టూర్, వెస్టిండీస్‌ సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే...

29

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన భారత ఓపెనర్ కెఎల్ రాహుల్, మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు...

39

భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా ఫిట్‌నెస్‌ లేమితో జట్టుకి దూరమయ్యాడు. కరోనా నుంచి కోలుకున్న అక్షర్ పటేల్, తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు...

49

తాజాగా టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా భారత జట్టుకి దూరమయ్యాడు. మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సుందర్‌కి గాయమైంది...

59

‘మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. అతని కోలుకోవడానికి సమయం పడుతుంది...’ అంటూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది...

69

వాషింగ్టన్ సుందర్ స్థానంలో భారత సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను టీ20 సిరీస్ జట్టుకి ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల చేసింది భారత క్రికెట్ బోర్డు...

79

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికైన వాషింగ్టన్ సుందర్, కౌంటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. అతని చేతి వేలికి తీవ్ర గాయం కావడంతో దాదాపు మూడు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు...

89

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌తో పాటు టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీకి వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో నాలుగేళ్ల తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌కి పొట్టి ఫార్మాట్‌లో అవకాశం దక్కింది...

99

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.8.75 కోట్లకు వాషింగ్టన్ సుందర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...

click me!

Recommended Stories