టీమిండియాను ఫాలో అవుతున్న లంక... రాహుల్ ద్రావిడ్‌ స్థానంలో అక్కడ మహేళ జయవర్థనే...

First Published Jul 9, 2021, 4:03 PM IST

గత పదేళ్లలో భారత జట్టు, వరల్డ్ టాప్ టీమ్‌లలో ఒకటిగా ఎదిగితే, పక్కనే ఉన్న శ్రీలంక మాత్రం దారుణంగా దిగజారింది. దీంతో లంక క్రికెట్ బోర్డు కూడా జట్టును మూలాల నుంచి రిపేర్లు చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టిందట...

‘ఏ జట్టు ప్రదర్శన మెరుగవ్వాలన్నా... అండర్ 19, అండర్ 16 జట్లు బలంగా ఉండడం విశేషం. టీనేజ్ క్రికెటర్ల ప్రదర్శనపై ఫోకస్ పెడితే, జట్టు ఆటోమేటిక్‌గా బలంగా తయారవుతుంది. ప్రస్తుతం టీమిండియా పర్ఫామెన్స్‌కి ఇదే కారణం...
undefined
పునాది లాంటి అండర్ 19 టీమ్‌పై ఫోకస్ పెట్టింది భారత్. అండర్ 19 జట్టుకి మోస్ట్ డిసిప్లేన్, క్లాస్ ప్లేయర్ అయిన రాహుల్ ద్రావిడ్‌ని కోచ్‌గా నియమించడం చాలా గొప్ప పని...
undefined
రాహుల్ ద్రావిడ్ అనుభవంతో పాటు అతని క్రమశిక్షణ కూడా భారత రిజర్వు బెంచ్‌ని పటిష్టం చేయడంలో ఎంతో ఉపయోగపడ్డాయి... ఆయన క్రికెట్ నాలెడ్జ్‌తో కుర్రాళ్లను స్టార్లుగా తీర్చిదిద్దారు...
undefined
ద్రావిడ్‌ను చూసిన తర్వాత మేం కూడా అండర్-19 జట్టుకి కోచ్‌గా మహేళ జయవర్థనేని నియమించాలని ప్రయత్నించాం. ఆయనని ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా, అది వర్కవుట్ కాలేదు...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ కెప్టెన్ అరవింద డిసిల్వా...
undefined
‘భారత జట్టు ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది, అందుకే వాళ్లు ఓ వైపు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతూనే, మరో జట్టుతో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ ఆడబోతున్నారు...
undefined
అయినంత మాత్రాన ఇది బీ టీమ్ కాదు. ఎందుకంటే శ్రీలంకకి వచ్చిన జట్టులో కూడా ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. వీరికి అన్ని ఫార్మాట్లు ఆడిన అనుభవం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు అరవింద డిసిల్వా...
undefined
బయో బబుల్ లైఫ్‌పై కామెంట్ చేసిన అరవింద డిసిల్వా... ‘క్రికెటర్లకీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారికి కుటుంబంతో గడిపేందుకు తగినంత సమయం ఇవ్వాలి. క్రికెట్ ఆడే జట్లన్నీ రొటేషన్ పద్ధతిని అనుసరిస్తే ఇది వీలవుతుంది’ అంటూ కామెంట్ చేశాడు.
undefined
click me!