అదృష్టమంటే ఆరోన్ ఫించ్‌దే... అలెక్స్ హేల్స్ ప్లేస్‌లో కేకేఆర్‌లోకి ఎంట్రీ, సీఎస్‌కే తప్ప...

Published : Mar 12, 2022, 03:51 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో అమ్ముడుపోని ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఐపీఎల్ 2022 మెగా వేలంలోనూ ఏ ఫ్రాంఛైజీని ఆకట్టుకోలేకపోయాడు. అయితే అదృష్టవశాత్తు కేకేఆర్ తరుపున ఆడబోతున్నాడు ఆరోన్ ఫించ్...

PREV
112
అదృష్టమంటే ఆరోన్ ఫించ్‌దే... అలెక్స్ హేల్స్ ప్లేస్‌లో కేకేఆర్‌లోకి ఎంట్రీ,  సీఎస్‌కే తప్ప...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

212

అయితే బిగ్‌బాష్ లీగ్ తర్వాత కొన్నాళ్లు బయో బబుల్ జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న అలెక్స్ హేల్స్... ఐపీఎల్ 2022 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 

312

‘ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించడానికి చాలా బాధపడుతున్నా. నాలుగు నెలలుగా ఇంటికి దూరంగా గడుపుతున్నాను...

412

కరోనా పాజిటివ్‌గా తేలాను. ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్ని రోజులు ఈ సెక్యూర్ వాతావరణంలో గడపలేనని అనిపిస్తోంది. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నా. 

512

వేలంలో నన్ను కొనుగోలు చేసిన కేకేఆర్‌కి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఈ నిర్ణయాన్ని వారు స్వాగతిస్తారని భావిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు అలెక్స్ హేల్స్...

612

అలెక్స్ హేల్స్ ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న వెంటనే, అతని స్థానంలో ఆరోన్ ఫించ్‌ను తీసుకుంటున్నట్టు ప్రకటించింది కేకేఆర్...

712

బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఆడబోతున్న ఆరోన్ ఫించ్, ఐపీఎల్‌లో అరుదైన రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...

812

2010 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన ఆరోన్ ఫించ్, ఆ తర్వాత రెండు సీజన్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి, 2013లో పూణే వారియర్స్ ఇండియా, 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు...

912

2015లో ముంబై ఇండియన్స్‌కి ఆడిన ఆరోన్ ఫించ్, ఆ తర్వాత రెండేళ్లు గుజరాత్ లయర్స్‌కి, 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి, 2020లో ఆర్‌సీబీ తరుపున ఆడాడు...

1012

ఐపీఎల్ 2021, 2022 సీజన్లలో అమ్ముడుపోని ఆరోన్ ఫించ్... లక్కీగా రిప్లేస్‌మెంట్ రూపంలో కేకేఆర్ తరుపున ఆడబోతున్నాడు...

1112

ఐపీఎల్‌లో అత్యధిక జట్లకి ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఆరోన్ ఫించ్, ఒక్క సీఎస్‌కే మినహా ఐదేళ్ల కంటే ఎక్కువ సీజన్లు ఆడిన ఫ్రాంఛైజీలన్నింటి తరుపున ఆడేశాడు..

1212

ఐపీఎల్‌లో 87 మ్యాచులు ఆడిన ఆరోన్ ఫించ్, 25.7 సగటుతో 2005 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 88 పరుగులు నాటౌట్...

click me!

Recommended Stories