Published : Mar 04, 2022, 01:24 PM ISTUpdated : Mar 04, 2022, 01:29 PM IST
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వన్‌డౌన్ బ్యాటర్‌గా అవకాశం దక్కించుకున్న తెలుగు తేజం హనుమ విహారి, రాక రాక వచ్చిన ఛాన్స్‌ను చక్కగా వాడుకుంటున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించిన హనుమ విహారి, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...
14వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న హనుమ విహారికి ఇది ఐదో టెస్టు హాఫ్ సెంచరీ. సిడ్నీ టెస్టులో అశ్విన్‌తో కలిసి చారిత్రక డ్రా అందించిన తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో రెండో టెస్టు ఆడాడు విహారి...
213
సీనియర్ టెస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలకు విశ్రాంతి నివ్వడంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్‌లకు తుదిజట్టులో అవకాశం దక్కింది...
313
ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో వన్ డౌన్ ప్లేయర్‌గా మంచి రికార్డు ఉన్న హనుమ విహారి, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు...
413
కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన లహిరు కుమార బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
513
52 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 49 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
613
80 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో మాజీ సారథి విరాట్ కోహ్లీతో కలిసి 80+ భాగస్వామ్యం నెలకొల్పాడు హనుమ విహారి...
713
65 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టెస్టు కెరీర్‌లో 900+ ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరుపున టెస్టుల్లో అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్‌గా ఆరో స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ...
టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ, టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు...
1013
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే 8+ వేలు పైగా టెస్టు పరుగులు సాధించారు...
1113
సచిన్ 154 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలురాయి అందుకుంటే, ద్రావిడ్ 158, వీరేంద్ర సెహ్వాగ్ 160, సునీల్ గవాస్కర్ 166 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నారు. విరాట్ కోహ్లీ తన 169 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు...
1213
తన 100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇంతకుముందు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఫీట్ సాధించాడు...
1313
76 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, యంగ్ స్పిన్నర్ ఎంబూల్దెనియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... దీంతో విహారి, విరాట్ 90 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.