టీమిండియాకి ఊహించని షాక్... సౌతాఫ్రికా సిరీస్‌కి కెఎల్ రాహుల్ దూరం, కెప్టెన్‌గా రిషబ్ పంత్...

Published : Jun 08, 2022, 06:20 PM ISTUpdated : Jun 08, 2022, 06:51 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలు విశ్రాంతి తీసుకోవడంతో టీమిండియా కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌కి ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా టూర్‌లో రెండో టెస్టుకి, వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, ఒక్క విజయం కూడా అందుకోలేకపోయాడు...

PREV
16
టీమిండియాకి ఊహించని షాక్... సౌతాఫ్రికా సిరీస్‌కి కెఎల్ రాహుల్ దూరం, కెప్టెన్‌గా రిషబ్ పంత్...

సౌతాఫ్రికాలో కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ రోహిత్ శర్మ విశ్రాంతి కోరుకోవడంతో మరోసారి కెఎల్ రాహుల్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే సౌతాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందే కెఎల్ రాహుల్ గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు...

26

ప్రాక్టీస్ సెషన్స్‌లో కెఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడడంతో అతనికి విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. దీంతో అతను సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. వచ్చే నెల ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌కి కెఎల్ రాహుల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది కూడా అనుమానంగా మారింది...
 

36

కెఎల్ రాహుల్ గాయపడడంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్ పంత్, భారత జట్టును నడిపించబోతున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌, అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా ఇదే మొదటి అవకాశం...

46

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న మొదటి టీ20 మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఆ తర్వాత 12న కటక్, 14న విశాఖపట్నం, 17న రాజ్‌కోట్, 19న బెంగళూరులో మ్యాచులు ఆడుతుంది టీమిండియా...

56

కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడం, రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఎంపిక కావడంతో హార్ధిక్ పాండ్యాకి టీమిండియా వైస్ కెప్టెన్సీ దక్కింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా, తర్వాతి సిరీస్‌లోనే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

66

కెఎల్ రాహుల్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గాయంతో సౌతాఫ్రికాతో సిరీస్ నుంచి దూరమయ్యాడు. ఈ ఇద్దరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో (ఎన్‌సీఏ) చేరి, గాయం నుంచి కోలుకోవడానికి వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు... 

Read more Photos on
click me!

Recommended Stories