ఎవరేం అనుకున్నా, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతనే... ధోనీ, విరాట్, రోహిత్ తర్వాత...

First Published Jun 7, 2022, 12:07 PM IST

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు బీసీసీఐ కూడా తెగ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్‌కి సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా అవకాశం ఇచ్చి, చేతులు కాల్చుకున్న భారత జట్టు... మరోసారి అదే సాహసం చేయడానికి సిద్ధమవుతోంది...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు కెఎల్ రాహుల్...

సౌతాఫ్రికా టూర్‌లో విరాట్ కోహ్లీ గాయపడడంతో రెండో టెస్టులో కెప్టెన్సీ చేసిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ గైర్హజరీతో వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు... కెప్టెన్‌గా మొదటి నాలుగు మ్యాచుల్లో విజయాలు అందుకోలేకపోయాడు కెఎల్ రాహుల్...

Latest Videos


KL Rahul

ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, సౌతాఫ్రికాపైనే టీ20ల్లోనూ కెప్టెన్‌గా లక్‌ని పరీక్షించుకోబోతున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన ఆరో భారత ప్లేయర్‌గా నిలవనున్నాడు కెఎల్ రాహుల్..

ఇంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్లు ఎమ్మెస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, అజింకా రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్లుగా వ్యవహరించాడు.ఇప్పుడు ఆ లిస్టులో కెఎల్ రాహుల్ చేరబోతున్నాడు...

ఇప్పటికే వరుసగా మొదటి నాలుగు మ్యాచుల్లో పరాజయాలు అందుకున్న టీమిండియా చెత్త రికార్డు మూటకట్టుకున్న కెఎల్ రాహుల్, ఫలితాలతో సంబంధం లేకుండా భారత ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడని భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
 

అయితే సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో కెఎల్ రాహుల్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఫెయిల్ అయితే మాత్రం ఇక మళ్లీ అతనికి సారథ్య బాధ్యతలు ఇచ్చే సాహసం బీసీసీఐ, సెలక్టర్లు చేయకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.. 

Image Credit: PTI

అయితే భారత్‌లో భారత్‌ని ఓడించడం అంత తేలికయ్యే విషయం  కాదు.  సీనియర్లు దూరమైనా రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా వంటి మ్యాచ్ విన్నర్లతో పటిష్టంగా కనిపిస్తోంది భారత జట్టు..

జూన్ 9న ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిస్తే వరుసగా 13 టీ20 మ్యాచుల్లో గెలిచిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేస్తుంది భారత జట్టు...

click me!