టాప్ 10లోకి ఇషాన్ కిషన్ గ్రాండ్ ఎంట్రీ... ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఒకే ఒక్కడు...

Published : Jun 15, 2022, 04:33 PM ISTUpdated : Jun 15, 2022, 04:34 PM IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో జెట్ స్పీడ్‌తో టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20 సిరీస్ ఆరంభానికి ముందు 76వ ర్యాంకులో ఉన్న ఇషాన్ కిషన్, అమాంతం 68 స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ 7లోకి ఎంటర్ అయ్యాడు...

PREV
18
టాప్ 10లోకి ఇషాన్ కిషన్ గ్రాండ్ ఎంట్రీ... ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఒకే ఒక్కడు...

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రెండో టీ20లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. విశాఖపట్నంలో జరిగిన మూడో టీ20లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇషాన్ కిషన్...

28
Image credit: PTI

మొత్తంగా ఈ సిరీస్‌లో 3 మ్యాచుల్లో 54.67 సగటుతో 157.69 స్ట్రైయిక్ రేటుతో 164 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. ఈ ఏడాది టీ20ల్లో 340 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు...

38
Image credit: PTI

భారత జట్టు తరుపున టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఉన్న ఏకైక బ్యాటర్ ఇషాన్ కిషన్. గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న కెఎల్ రాహుల్, టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంకులో కొనసాగుతున్నాడు...

48
Image credit: PTI

శ్రేయాస్ అయ్యర్ 16వ స్థానంలో, రోహిత్ శర్మ 17వ స్థానంలో ఉండగా ఫామ్‌ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ 2 స్థానాలు దిగజారి టాప్ 20లో కూడా చోటు కోల్పోయాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 21వ స్థానంలో ఉన్నాడు...

58
Image credit: PTI

బౌలర్లలో భారత సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా 7 స్థానాలు ఎగబాకి టాప్ 11లోకి ఎంట్రీ ఇవ్వగా యజ్వేంద్ర చాహాల్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ స్థానంలోకి వచ్చాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజల్‌వుడ్, టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాడు...

68
Joe Root

టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో జో రూట్ మరోసారి టాప్‌లోకి ఎంట్రీ ఇవ్వగా లబుషేన్ రెండో స్థానానికి దిగజారాడు. మూడో స్థానంలో స్టీవ్ స్మిత్, 4వ స్థానంలో బాబర్ ఆజమ్, ఐదో స్థానంలో కేన్ విలియంసన్ ఉన్నారు. భారత జట్టు తరుపున టాప్ 8లో రోహిత్ శర్మ, టాప్ 10లో విరాట్ కోహ్లీ ఉన్నారు...

78

టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ప్యాట్ కమ్మిన్స్ టాప్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోగా టాప్ 2లో అశ్విన్, 3లో జస్ప్రిత్ బుమ్రా కొనసాగుతున్నారు. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో రవీంద్ర జడేజా, టాప్ 2లో రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నారు.

88
virat rohit

వన్డే ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్‌లో ఉండగా ఇమామ్ వుల్ హక్ టాప్ 2లో, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా టాప్ 5లో ఉండగా ఆల్‌రౌండర్లలో భారత ప్లేయర్లకు ఎవ్వరికీ చోటు దక్కలేదు...

Read more Photos on
click me!

Recommended Stories