సౌతాఫ్రికా టూర్ జరుగుతుంది, అయితే టీ20 సిరీస్‌ మాత్రం... క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ సెక్రటరీ జై షా...

First Published Dec 4, 2021, 12:25 PM IST

అసలు ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే డిస్కర్షన్ జరుగుతున్న సౌతాఫ్రికా టూర్‌పై బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసింది. కోట్ల ఆదాయం కంటే ఆటగాళ్ల భద్రత పెద్ద విషయం కాదని, సఫారీ టూర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది...

దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా వచ్చే నెలలో జరగాల్సిన ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌పై అనుమానాలు రేగాయి. ఇలాంటి టైంలో సఫారీ టూర్‌కి బీసీసీఐ అంగీకరించకపోవచ్చని అనుకున్నారంతా...

అయితే సఫారీ టూర్ ఉంటుందని... వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టు, వన్డే, టెస్టు సిరీస్ ఆడుతుందని స్పష్టం చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

అయితే సౌతాఫ్రికా టూర్‌లో ఆడాల్సిన నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ మాత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు మూడు వన్డేలు, మూడు టెస్టులు, నాలుగు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది...

అయితే డిసెంబర్‌లో వన్డే, టెస్టు సిరీస్ ఆడే భారత జట్టు, టీ20 సిరీస్‌ను మాత్రం పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆడనుంది. ఈ టైమ్‌లో స్వదేశానికి షెడ్యూల్ కంటే వారం ముందుగా తిరిగి వచ్చే భారత జట్టు, ఇక్కడ క్వారంటైన్‌లో గడపనుంది. 

ఇప్పటికే సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్-A జట్టు, సౌతాఫ్రికా- A టీమ్‌తో కలిసి మూడు అనధికారిక టెస్టు మ్యాచులు ఆడుతోంది. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ మ్యాచులు నిర్వహిస్తున్నారు...

ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌ను కూడా ఇలాగే నిర్వహిస్తామని, కట్టుదిట్టమైన బయో సెక్యూలర్ జోన్ ఏర్పాటు చేసి, భారత క్రికెట్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇస్తోంది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు..

డిసెంబర్ 9న సౌతాఫ్రికా బయలుదేరి వెళ్లే, భారత జట్టు... వన్డే, టెస్టు సిరీస్ ఆడిన ఆ తర్వాత స్వదేశానికి చేరకుని ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసే క్యాంపులో క్వారంటైన్‌ గడపనుందని సమాచారం...

అయితే డిసెంబర్ 9న కాకుండా సౌతాఫ్రికా టూర్ కూడా వారం రోజులు వాయిదా పడే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా ఉదృతి తగ్గిన తర్వాత టీమిండియా సఫారీ టూర్‌కి వెళ్లాలని భావిస్తోందని సమాచారం. 

click me!