రాహుల్ ద్రావిడ్ సూచనలు, సునీల్ గవాస్కర్ వీడియోలు... మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీ వెనక...

Published : Dec 04, 2021, 12:06 PM IST

ముంబై టెస్టులో టీమిండియా తరుపున బ్యాటింగ్ భారాన్ని మోస్తూ, ఒంటరి యోధుడిగా కనిపిస్తున్నాడు భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్. టెస్టు కెరీర్‌లో నాలుగో సెంచరీ బాదిన మయాంక్ అగర్వాల్, కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు...

PREV
111
రాహుల్ ద్రావిడ్ సూచనలు, సునీల్ గవాస్కర్ వీడియోలు... మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీ వెనక...

శుబ్‌మన్ గిల్‌తో కలిసి మొదటి వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మయాంక్ అగర్వాల్, ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

211

సీనియర్లు ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ డకౌట్ అయినా వృద్ధిమాన్ సాహాతో కలిసి ఐదో వికెట్‌కి 64 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాకి ఓ బాధ్యతాయుత స్కోరు చేరుకోవడానికి కారణమయ్యాడు మయాంక్ అగర్వాల్...

311

రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ అయినా అక్షర్ పటేల్‌తో కలిసి ఏడో వికెట్‌కి 60+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మయాంక్, రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 306 బంతుల్లో 16 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 146 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

411

‘తొలి టెస్టులో ఫెయిల్ అయ్యాక, రెండో టెస్టులో ప్లేస్ ఉంటుందో లేదోనని చాలా కంగారుపడ్డాను. అయితే నాకు ప్లేస్ ఉందని రాహుల్ ద్రావిడ్ చెప్పారు...

511

ఇది నీకు చక్కని అవకాశం, దీన్ని కరెక్టుగా వాడుకో. క్రీజులోకి వెళ్లిన తర్వాత నీ బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలి. క్రీజులో కుదురుకుని, భారీ స్కోరు చేయడానికి ఫోకస్ పెట్టు... అని రాహుల్ ద్రావిడ్ సూచించారు...

611

ఆయన చెప్పిన మాటలపైనే పూర్తిగా దృష్టి పెట్టా. తొలి వికెట్‌కి 80 పరుగులు జోడించిన తర్వాత భారీ స్కోరు చేయగలననే నమ్మకం నాలో కలిగింది. అందుకే సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని ఫిక్స్ అయ్యా...

711

సునీల్ గవాస్కర్ వీడియోలు చూస్తూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా. నా బ్యాటింగ్‌లో ఉన్న చిన్న చిన్న టెక్నిక్‌ లోపాలను ఆయన సరిదిద్ారు. బ్యాట్ కాస్త కిందకి పెట్టి ఆడమని సలహా ఇచ్చారు...

811

అజాజ్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతనిపై ఎదురుదాడి చేస్తే, ఒత్తిడిలో పడతాడని అనుకున్నా. అనుకున్నట్టే అతని బౌలింగ్‌లో షాట్స్ ఆడాను...’ అంటూ కామెంట్ చేశాడు మయాంక్ అగర్వాల్...

911

సునీల్ గవాస్కర్ కూడా మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘ఈ విషయంపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అతనికి సూచనలు ఇచ్చింది నేనే...

1011

భారత మాజీ క్రికెటర్‌గా, టీమిండియా ఆటతీరును పట్టించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేనే స్వయంగా మయాంక్ అగర్వాల్‌ను కలిసి, కొన్ని టెక్నికల్ లోపాలను సరిదిద్దుకోవడానికి సలహాలు, సూచనలు ఇచ్చాను...

1111

అయితే ఎవరెన్ని సలహాలు ఇచ్చినా, సూచనలు చేసినా... క్రీజులోకి వెళ్లిన తర్వాత బ్యాట్స్‌మెన్‌ ఆటని నిర్ణయించేది అతని మానసిక దృడత్వమే. ఆ విషయంలో మయాంక్ చాలా స్ట్రాంగ్‌‌గా కనిపిస్తున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్..

click me!

Recommended Stories