సారీ! నేను అతనంత వేగంగా బౌలింగ్ చేయలేను, అందుకే... హర్షల్ పటేల్ కామెంట్...

Published : Jun 17, 2022, 04:14 PM IST

30 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎల్ 2021 పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి ఆరంగ్రేటం చేశాడు హర్షల్ పటేల్. భారత జట్టు తరుపున 11 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, టీ20ల్లో ప్రధాన బౌలర్లలో ఒకడిగా మారిపోయాడు...

PREV
18
సారీ! నేను అతనంత వేగంగా బౌలింగ్ చేయలేను, అందుకే... హర్షల్ పటేల్ కామెంట్...
Harshal Patel

డెత్ ఓవర్ స్పెషలిస్టుగా మారిన హర్షల్ పటేల్, సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. సౌతాఫ్రికా విజయానికి 24 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన దశలో హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 22 పరుగులు రాబట్టాడు వాన్ దేర్ దుస్సేన్. ఈ ఓవర్‌తో మ్యాచ్ పూర్తిగా సఫారీ టీమ్ చేతుల్లోకి వెళ్లిపోయింది...

28
Image credit: PTI

రెండో టీ20 మ్యాచ్‌లో 3 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసిన హర్షల్ పటేల్, విశాఖపట్నంలో జరిగిన మూడో టీ20లో 3.1 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు... 

38

‘ఐపీఎల్‌లో గత రెండేళ్లుగానే నాకు గుర్తింపు వచ్చింది. నా బౌలింగ్‌ని అర్థం చేసుకోవడానికి బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. బౌలర్లు ఎక్కువ కాలం ఆడే కొద్దీ, అతని బలాలు, బలహీనతలు ప్రత్యర్థి బ్యాటర్లకు తెలుస్తూ ఉంటాయి...

48

అందుకే ఓ బౌలర్‌గా వారి కంటే ఓ అడుగు ముందే ఉండడం నాకు చాలా అవసరం. ఓ రోజుకి బౌలర్‌కి 15 ప్లాన్స్ ఉండాలి, అప్పుడే వాటిల్లో కొన్నైనా సరిగ్గా వర్కవుట్ అవుతాయి. ముఖ్యంగా ఉత్కంఠభరిత మ్యాచుల్లో ఎన్ని ఎక్కువ అస్త్రాలు ఉంటే, అంత మంచిది...

58

నేను ఉమ్రాన్ మాలిక్‌లా 150 కి.మీ.ల వేగంతో బంతులు వేయలేదు. అది నా బలం కూడా కాదు. అందుకే ప్రతీ డెలివరీ లైన్ అండ్ లెంగ్త్‌పై మాత్రమే ఫోకస్ పెట్టి, బెస్ట్ రిజల్ట్ రాబట్టే ప్రయత్నం చేస్తాను...

68

అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘకాలం రాణించాలంటే స్కిల్స్ ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి. ఏ పిచ్‌లో అయినా బౌలింగ్ చేసి వికెట్లు రాబట్టగల బౌలర్లు మన దగ్గర చాలా మంది ఉన్నారు...

78
Harshal Patel

స్లో పిచ్ అయినా బౌన్సీ పిచ్ అయినా ఎలాంటి ఏరియాల్లో బౌలింగ్ చేస్తే వికెట్లు తీయొచ్చు వారికి పూర్తి అవగాహన ఉంటుంది. నేను ఆ విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్...

88
Harshal Patel

ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్, 2022 సీజన్‌లోనూ ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో హర్షల్ పటేల్‌కి చోటు తప్పక ఉంటుందని భావిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

click me!

Recommended Stories