Virat Kohli vs Babar Azam: పాకిస్తాన్ సారథి, ప్రపంచ క్రికెట్ లో రికార్డులు బద్దలు కొడుతున్న బాబర్ ఆజమ్ ఇప్పటికే విరాట్ కోహ్లి రికార్డులు అధిగమించాడని అంటున్నాడు విండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో ప్రస్తుతానికి ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఇప్పటికీ ప్రమాదకారియే. మరోవైపు కోహ్లి బాటలో నడుస్తూ అతడి రికార్డులకే ఎసరు పెట్టిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మాత్రం కెరీర్ పీక్స్ లో ఉన్నాడు.
28
అయితే ఇప్పటికే వన్డేలలో బాబర్.. కోహ్లిని దాదాపు అధిగమించాడని, రాబోయే రోజుల్లో అతడు ప్రపంచంలో టాప్-4 బ్యాటర్లలో ఒకడిగా ఉంటాడని వెస్టిండీస్ మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ ఇయాన్ బిషప్ తెలిపాడు.
38
బిషప్ మాట్లాడుతూ.. ‘బాబర్ ఆజమ్ ప్రస్తుతం తన కెరీర్ పీక్స్ లో ఉన్నాడు. అతడు రాబోయే రోజుల్లో గొప్ప బ్యాటర్ అవుతాడు. నేను సాధారణంగా గొప్ప అనే పదాన్ని అంత సులభంగా వాడను. చాలా ఆలోచించి.. నా టీమ్ తో చర్చించిన తర్వాత మాట్లాడుతున్నాను.
48
పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆజమ్ రికార్డులు సృష్టిస్తాడు. అతడు ఇప్పటికే 50 ఓవర్ల క్రికెట్ లో విరాట్ కోహ్లి ని దాదాపు అధిగమించినట్టే. అయితే అతడు టెస్టు క్రికెట్ లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం.
58
టెస్టులలో కూడా అతడు రాణిస్తాడని నేను అనుకుంటున్నాను. టెక్నికల్ గా అతడు సూపర్బ్ ప్లేయర్. భవిష్యత్ లో అతడు ప్రపంచంలోనే టాప్-4 ఆటగాళ్లలో ఒకరిగా నిలుస్తాడు..’ అని బిషప్ తెలిపాడు.
68
ఇటీవలి కాలంలో ఆజమ్ వర్సెస్ కోహ్లి చర్చ బాగా నడుస్తున్నది. అందుకు అనుకూలమో వ్యతిరేకమో గానీ ప్రస్తుతానికి కోహ్లి ఫామ్ లో లేడు. బాబర్ మాత్రం సూపర్ ఫామ్ తో ఆకట్టుకుంటున్నాడు.
78
గణాంకాలు చూస్తే.. ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్ లో బాబర్ ఆజమ్ 40 టెస్టులు, 87 వన్డేలు, 74 టీ20లు ఆడాడు. టెస్టులలో 2,851 రన్స్, వన్డేలలో 4,441, టీ20లలో 2,686 పరుగులు సాధించాడు. టెస్టులలో 6, వన్డేలలో 17, టీ20లలో ఒక సెంచరీ చేశాడు.
88
ఇక కోహ్లి విషయానికొస్తే.. 101 టెస్టులలో 8,043 రన్స్ (27 సెంచరీలు), 260 వన్డేలలో 12,311 పరుగులు (43 శతకాలు), 97 టీ20లలో 3,296 రన్స్ చేశాడు. కోహ్లి తిరిగి ఫామ్ లోకి వస్తే మళ్లీ పరుగుల వేట ప్రారంభించడం పెద్ద కష్టమేమీ కాదనేది అతడి అభిమానుల వాదన.