ఇతన్నేనా మిస్టరీ స్పిన్నర్ అంటూ దాచారు, తనకంటే పదో క్లాస్ పిల్లలే నయం... పాక్ మాజీ పేసర్ కామెంట్స్...

First Published Oct 25, 2021, 8:19 PM IST

‘మిస్టరీ స్పిన్నర్’ అంటూ వరుణ్ చక్రవర్తిని, టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచుల్లో కూడా సరిగా ఆడించకుండా దాచిపెట్టింది టీమిండియా. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చక్రవర్తి ఆడినా, అతనితో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేయించారు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి వెలుగులోకి వచ్చాడు వరుణ్ చక్రవర్తి. సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి, ఆసీస్ టూర్‌కి కూడా ఎంపికయ్యాడు.

అయితే గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి దూరం కావడంతో ఆ టూర్‌లో నటరాజన్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు... స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌‌కి ఎంపికైనా ఫిట్‌నెస్ టెస్టు ఫెయిల్ కావడంతో ఆడలేకపోయాడు...

ఐపీఎల్ 2020లో 17 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి, 2021 సీజన్‌లో 18 వికెట్లు తీసి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్ మ్యాచుల్లో అయితే ఎకానమీ 7 దాటకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు...

అయితే అతని బౌలింగ్‌లోని మిస్టరీ మొత్తం వికెట్ల వెనకాల నుంచి అతనికి సూచనలు ఇచ్చే దినేశ్ కార్తీక్‌దేనని తేలిపోయింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా తేలిపోయాడు వరుణ్ చక్రవర్తి...

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన వరుణ్ చక్రవర్తి, కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ‘గేమ్ ఛేంజర్‌’గా కనిపించాడు.

అయితే ఆ తర్వాతి ఓవర్‌లో 6, మూడో ఓవర్‌లో ఓ ఫోర్‌తో 9 పరుగులు, తన ఆఖరి ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు సమర్పించాడు వరుణ్...

వన్‌సైడెడ్‌గా సాగిన ఇన్నింగ్స్‌లో మూమెంట్‌ను మొత్తం పాక్‌వైపు మల్లింది కూడా వరుణ్ చక్రవర్తి వేసిన 13వ ఓవర్‌లోనే... వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఈజీగా 2 సిక్సర్లు సాధించిన బాబర్, రిజ్వాన్... రన్‌రేట్‌ను తగ్గించేసి, కన్ఫర్ట్‌గా బ్యాటింగ్ చేశారు...

‘మిస్టరీ స్పిన్నర్ అంటే ఎలా వేస్తాడోనని చాలా ఊహించుకున్నా. కానీ వరుణ్ చక్రవర్తి వేసిన స్పిన్‌ చూస్తుంటే నవ్వొచ్చింది. ఇలాంటి స్పిన్ బౌలింగ్‌ను మా దగ్గర పదో క్లాస్ పిల్లలు కూడా ఈజీగా నేర్చుకుంటారు...

టీమిండియాను కూడా ఇబ్బందిపెట్టిన లంక మాజీ స్పిన్నర్ అజంతా మెండీస్, పాకిస్తాన్‌పై పెద్దగా పర్ఫామెన్స్ చూపించలేకపోయాడు. ఎందుకంటే పాక్ ప్లేయర్లు, స్పిన్‌ని చాలా ఈజీగా ఆడగలరు...

పాక్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టాలంటే మణికట్టు మ్యాజిక్ ఉండాలి. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ యాక్షన్ గమనిస్తే, ఈజీగా బంతి ఎటువైపు వెళ్తుందో అంచనా వేయొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ సల్మాన్ భట్...

వరుణ్ చక్రవర్తి మీద ఉన్న నమ్మకంతో ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చి రెండు వికెట్లు తీసిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టింది టీమిండియా... 

click me!