లక్షల్లో హోటల్ రూమ్ రెంట్స్! ఆసుపత్రి బెడ్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్.. వరల్డ్ కప్‌లో ఇండో- పాక్ మ్యాచ్‌కి

Published : Jul 21, 2023, 05:10 PM IST

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్‌ మ్యాచ్‌‌కి ఏడాది ముందే టికెట్స్ అన్నీ అయిపోయాయి. అలాంటిది ఇండియాలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే సీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే..  

PREV
17
లక్షల్లో హోటల్ రూమ్ రెంట్స్! ఆసుపత్రి బెడ్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్..  వరల్డ్ కప్‌లో ఇండో- పాక్ మ్యాచ్‌కి

2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత 7 ఏళ్లకు మొదటిసారిగా ఇండియాలో అడుగుపెట్టబోతోంది పాకిస్తాన్ క్రికెట్ టీమ్. 2021 టీ20 వరల్డ్ కప్‌, ఇండియాలో జరిగి ఉంటే హైదరాబాద్‌లో ఇండో- పాక్ మ్యాచ్ చూసే అవకాశం దక్కి ఉండేది. అయితే కరోనా కారణంగా ఆ టోర్నీని యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది..

27

అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15న నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అహ్మదాబాద్‌లో హోటల్ రూమ్స్‌కి విపరీతమైన డిమాండ్ వచ్చేసింది..

37

ఇంతకుముందు 2-3 వేలు ఉన్న రూమ్ రెంట్, ఇప్పుడు లక్ష రూపాయలకు పైగా పలుకుతోంది. 200-300 గదులు ఇచ్చే చిన్నాచితకా హోటల్స్‌ కూడా ఒక్క రోజుకి 20-30 వేల దాకా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 20 వరకూ అహ్మదాబాద్‌లోని స్టార్ హోటల్స్‌లోని రూమ్‌లన్నీ బుక్ అయిపోయాయి. 
 

47

దీంతో క్రికెట్ ఫ్యాన్స్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. హోటల్ రెంట్ కట్టడం కంటే హాస్పటిల్ బిల్లు కట్టడం బెటర్ అని ఫిక్స్ అయిపోయారు. అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్‌కి విపరీతంగా గిరాకీ పెరిగింది. అక్టోబర్ 14-16 తేదీల్లో అహ్మదాబాద్ చుట్టుపక్కన ఆసుపత్రుల్లోని బెడ్స్ అన్నీ క్రికెట్ ఫ్యాన్స్‌తో నిండిపోబోతున్నాయి..

57

బెడ్స్‌కి రోజుకి 3 వేల నుంచి 25 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. ఇందులోనే ఫుడ్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఒక్క బెడ్‌లో పేషెంట్‌తో పాటు మరో వ్యక్తి అటెండెంట్‌గా పడుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో హోటల్స్ నుంచి హాస్పటిల్స్‌కి మకాం మారుస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

67

‘ఫుల్ బాడీ చెక్‌అప్ పేరుతో ఆసుపత్రి బెడ్స్ బుక్ చేసుకుంటున్నారు. రాత్రి పడుకోవడానికి బెడ్ దొరుకుతుంది. తినడానికి ఆహారం దొరుకుతుంది. లాడ్జింగ్ డబ్బులు ఆదా అవుతాయి. హెల్త్ చెకప్ కూడా చేసుకున్నట్టు అవుతుంది. అందుకే బెడ్స్‌కి విపరీతమైన డిమాండ్ పెరుగుతంది..

77

గత రెండు మూడు రోజులుగా మాకు విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అక్టోబర్ 15న ఫుల్ బాడీ చెకప్ కోసం ప్యాకేజీ కూడా ప్రకటించాం. మాతో పాటు చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులన్నీ ఆ అవకాశాన్ని వాడుకుంటున్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యజమాని.. 

click me!

Recommended Stories