మా అమ్మ ఫోన్ చేసి నీ బ్యాటింగ్ చూసేందుకు వస్తానని చెప్పింది! విరాట్ కోహ్లీతో విండీస్ వికెట్ కీపర్...

క్రికెట్ ఆటలో సెడ్జింగ్ కూడా ఓ భాగమే. అయితే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తుంటే సెడ్జ్ చేయడానికి భయపడతారు ప్రత్యర్థి టీమ్ ప్లేయర్లు. ఎందుకంటే వీరిని రెచ్చగొడితే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు...

Get this Hundred Virat, I want you to score Hundred, Joshua De Silva conversation with Virat Kohli CRA

వెస్టిండీస్, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ, విండీస్ వికెట్ కీపర్ జోషువా డి సిల్వ మధ్య ఇలాంటి ఓ సంభాషణే జరిగింది. విరాట్ కోహ్లీ 65 పరుగులు ఉన్న సమయంలో అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో డైవ్ చేసి 2 పరుగులు రాబట్టాడు...

Get this Hundred Virat, I want you to score Hundred, Joshua De Silva conversation with Virat Kohli CRA

డైవ్ చేయకపోయినా విరాట్ కోహ్లీ ఈజీగా 2 పరుగులు పూర్తి చేసుకునేవాడు, అయితే రిస్క్ చేయడం ఇష్టం లేక దూకేశాడు. విరాట్ కిందపడిన తర్వాత వికెట్లను గిరాటేశాడు జోషువా డి సిల్వ. ఈ సమయంలో ‘నేను 2012 నుంచి ఇలాంటి పరుగులు తీస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
 


దానికి జోషువా, ఎంతో వినయంగా స్పందించాడు. ‘మా అమ్మ ఉదయాన్నే ఫోన్ చేసి, విరాట్‌ని చూసేందుకు, మీ బ్యాటింగ్ చూసేందుకు వస్తున్నానని చెప్పింది. ఇప్పటికీ నేను దాన్ని నమ్మలేకపోతున్నా.. నేను ఆడేటప్పుడు కూడా మా అమ్మ ఎప్పుడూ మ్యాచ్ చూసేందుకు రాలేదు...

విరాట్, ఎలాగైనా సెంచరీ చేసుకో... నువ్వు సెంచరీ చేయడం చూడాలని ఉంది.. ’ అంటూ కామెంట్ చేశాడు జోషువా డి సిల్వ. దానికి విరాట్ కోహ్లీ.. ‘నా సెంచరీపై నీకు బాగా ఆశగా ఉన్నట్టుంది...’ అంటూ రిప్లై ఇచ్చాడు.. 
 

‘అవును, నేను నీకు పెద్ద అభిమానిని. నువ్వు సెంచరీ చేయడం నేను చూడాలి... ’ అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Virat Kohli

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులతో క్రీజులో ఉన్నాడు విరాట్ కోహ్లీ.. విరాట్‌కి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్ కూడా..
 

Latest Videos

vuukle one pixel image
click me!