ఆ ఓటమి మరిచిపోవడం కష్టమే! కానీ మా ప్రతాపం చూపిస్తాం... - పాక్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్...

Published : Oct 27, 2022, 11:24 AM IST

రాక రాక లేక లేక లక్కీగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాపై దక్కిన విజయాన్ని చూసి పొంగిపోయింది పాకిస్తాన్. భారత జట్టుపై 10 వికెట్ల తేడాతో గెలిచి పరువు తీశామని పదే పదే చెప్పుకుంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా తిరిగి విజయాన్ని అందుకుని రివెంజ్ తీర్చుకుంది...

PREV
15
ఆ ఓటమి మరిచిపోవడం కష్టమే! కానీ మా ప్రతాపం చూపిస్తాం... - పాక్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్...
Shan Masood

బాబర్ ఆజమ్ డకౌట్, మహ్మద్ రిజ్వాన్ 4 పరుగులు చేసి అవుట్ కావడంతో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ జట్టును షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్ 159 పరుగుల స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు....

25
iftikhar ahmed

షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా ఇఫ్తికర్ అహ్మద్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

35
Ashwin-Virat Kohli

‘టీమిండియా చేతుల్లో ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమే. ఆఖరి ఓవర్ దాకా గెలుస్తామనే నమ్మకం ఉండింది. ఈ ఓటమితో ప్లేయర్లు అందరూ నిరాశతో కృంగిపోయారు. అయితే కెప్టెన్ బాబర్ ఆజమ్, కోచింగ్ సిబ్బంది ప్లేయర్లకు అండగా నిలిచారు.

45
Iftikhar Ahmed

ఆటలో గెలుపు ఓటములు సహజమని తెలిపి మాలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. మేం ఓడినా ఆఖరి బంతి దాకా పోరాడగలిగాం. మా ఫోకస్ ఇప్పుడు మిగిలిన మ్యాచులపైనే. తొలి మ్యాచ్‌లో ఓడినా జింబాబ్వే, నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఉన్నాయి... వాటిపై మా ప్రతాపం చూపిస్తాం..

55
Virat Kohli Six

ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్‌లు మాకు కొత్తేమీ కాదు. మేం బౌన్సీ ట్రాక్‌లపై చాలా ప్రాక్టీస్ చేస్తాం. హారీస్ రౌఫ్ మా మెయిన్ బౌలర్. అతని నుంచి చాలా ఆశిస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్... 

click me!

Recommended Stories