రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్...

First Published Oct 25, 2021, 6:30 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 ట్రోఫీలో టీమిండియాకి పాకిస్తాన్ చేతుల్లో ఘోర ఓటమి ఎదురైంది. పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, ఐసీసీవరల్డ్‌కప్ ట్రోఫీ మ్యాచుల్లో మొట్టమొదటిసారి దాయాది చేతుల్లో పరాజయాన్ని రుచి చూసింది. ఈ ఓటమి బాధ నుంచి భారత అభిమానులు తేరుకోలేకపోతున్నారు...

టీమిండియా ఓటమి బాధతో పాటు విరాట్ కోహ్లీ అభిమానులను మరో అనుమానం కూడా వెంటాడుతోంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ, తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

పాకిస్తాన్‌పై రోహిత్ డకౌట్ కావడం ఇది రెండోసారి కాగా, గోల్డెన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి.  గౌతమ్ గంభీర్ తర్వాత పాకిస్తాన్‌పై డకౌట్ అయిన రెండో భారత ఓపెనర్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ... 

వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, మురళీ విజయ్, ఆశీష్ నెహ్రా, సురేష్ రైనా తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ... అయితే ఈ మ్యాచ్ తర్వాత రోహిత్‌పై పెద్దగా ట్రోలింగ్ కానీ, విమర్శలు కానీ రాలేదు...

అదే రోహిత్ శర్మ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే... ఈపాటికి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఏకిపారేసేవాళ్లు... ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు...

 టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ అయ్యేదాకా అవసరం లేదు, ముందుగానే కెప్టెన్సీ నుంచి తప్పుకొమ్మని డిమాండ్లు వినిపించేవి...

అయితే అసలు విరాట్ కోహ్లీకి జట్టులో ప్లేస్ అవసరమా? అని కృశ్చిన్స్ కూడా వచ్చేవి. వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో కుదురుకుని హాఫ్ సెంచరీ చేశాడు కాబట్టి సరిపోయింది కానీ, లేకుండా మ్యాచ్ అనంతరం పాక్ క్రికెటర్లకు అభినందనలు తెలిపినందుకు కూడా విరాట్‌పై ‘దేశద్రోహి’ అనే ముద్ర వేసేసేవాళ్లు నెటిజన్లు...

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఫ్లెక్సీలు, దిష్టబొమ్మలు తగలబెడుతూ నానా రచ్చ కచ్ఛితంగా జరిగేది. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఇక్కడ అభిమానుల కంటే హేటర్సే ఎక్కువ.

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించిన విరాట్, ఇక్కడ మాత్రం హేటర్స్‌తో నిత్యం ఓ మినీ యుద్ధమే చేస్తున్నాడు...

ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం విరాట్‌కి కొత్తేమీ కాదు. గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీపై వచ్చిన ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువే. అయినా అవేమీ పట్టించుకోకుండా తన బాధ్యతను తెలుసుకుని, సరైన సమయంలో సరైన రీతిలో బ్యాటింగ్ చేసి టీమిండియాను ఆదుకున్నాడు విరాట్ కోహ్లీ...

పాకిస్తాన్‌పై ఐసీసీ టోర్నీల్లో 500+ పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, . క్రిస్ గేల్ 9 హాఫ్ సెంచరీలను అధిగమించి, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. .. 

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్ కూడా విరాట్ కోహ్లీ. గత ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ, ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు...

అంతేకాదు పాకిస్తాన్‌పై టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో విరాట్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ. ఒకే జట్టుపై అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ, క్రిస్ గేల్ (ఆస్ట్రేలియాపై నాలుగు) తర్వాతి స్థానంలో ఉన్నాడు కోహ్లీ...

click me!