India vs Pakistan : భారత్ కు తలొగ్గిన పాకిస్థాన్ ... ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్, ఫైనల్ కూడా పాక్ లో జరగవా?

First Published | Nov 30, 2024, 2:51 PM IST

అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ పై ఎప్పుడూ భారత్ దే పైచేయి. తాజాగా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇదే జరిగింది. భారత్ అనుకున్నట్లే టీమిండియా పాకిస్థాన్ లో అడుగుపెట్టడం లేదు. 

India vs Pakistan

India vs Pakistan : దాయాది పాకిస్థాన్ పై మరోసారి భారత్ దే పైచేయిగా నిలిచింది. ఎట్టకేలకు ఐసిసి ఛాపింయన్స్ ట్రోపిపై కొంతకాలంగా సాగుతున్న వివాదానికి తెరపడింది. ఛాంపియన్స్ ట్రోపీ కోసం భారత్ క్రికెట్ టీం ను పాకిస్థాన్ కు పంపించకూడదన్న  బిసిసిఐ నిర్ణయమే ఫైనల్ అయ్యింది. హైబ్రిడ్ పద్దతిలో భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ లో నిర్వహించేందుకు పాకిస్థాన్ అంగీకరించిందట. ఈ విషయాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ వెల్లడించారు. 

IND vs PAK

బిసిసిఐ, పిసిబి తో ఐసిసి సమావేశం సాగిందిలా :

ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు నిన్న (శుక్రవారం) ఐసిసి సమావేశం నిర్వహించింది. ఇందులో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, ఐసిసి సభ్యులు వర్చువల్ గా పాల్గొన్పారు. అయితే పాకిస్థాన్ కు వెళ్లేది లేదని బిసిసిఐ... తప్పకుండా టీమిండియా రావాల్సిందేనని పాక్ పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో చేసేదేమి లేక ఈ సమావేశాన్ని ఇవాళ్టికి వాయిదా వేసింది ఐసిసి. 

అయితే ఇవాళ మరోసారి బిసిసిఐ, పిసిబి ని సమావేశపర్చింది ఐసిసి. ఈ క్రమంలో పాక్ ను హైబ్రిడ్ పద్దతితో ఆ టోర్నీని నిర్వహించేందుకు ఐసిసి అంగీకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఆడే మ్యాచులను దుబాయ్ లో నిర్వహించేందుకు పాకిస్థాన్ అంగీకరించినట్లు మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ వెల్లడించారు.

''బిసిసిఐ, పిసిబితో పాటు అపెక్స్ బాడీ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అంగీకరించాయి. ఐసిసి ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చేది పాకిస్థానే. కానీ ఒక్క టీమిండియా మాత్రం పాకిస్థాన్ లో ఆడదు...తాత్కాలిక వేదికలపై ఆడుతుంది. ఒకవేళ టీమిండియా సెమీ ఫైనల్, ఫైనల్ కు చేరితే ఈ మ్యాచులు కూడా పాకిస్థాన్ బయట జరుగుతాయి'' అని రషీద్ లతీఫ్ తెలిపారు.
 


india pakistan

అసలు ఇండియా,పాక్ మధ్య వివాదమేంటి : 

పాకిస్థాన్ ను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఈ ఉగ్రవాదులను భారత్ పై ఉసిగొల్పి అల్లర్లు సృష్టించేలా ప్రతిసారీ కుట్రలు పన్నుతుంటుంది. ఇలా 2008 లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ దాడులకు తెగబడి రక్తపాతం సృష్టించింది. ఈ ఉగ్రదాడి పాక్ పనే కావడంతో ఆ దేశాన్ని భారత్ దూరం పెట్టింది. 

భారత్,పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాదు క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నారు. భారత ప్రభుత్వం అంగీకరించకపోవడంతో 2008 నుండి ఇప్పటివరకు టీమిండియా పాక్ లో పర్యటించలేదు. పాకిస్థాన్ కూడా ఒకటిరెండుసార్లు ఐసిసి మ్యాచుల కోసం ఇండియాకు వచ్చింది. కానీ భారత ప్రభుత్వం మాత్రం పాకిస్థాన్ లో పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు అంగీకరించడం లేదు. క్రికెటర్లను పాక్ కు పంపొద్దని బిసిసిఐని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.   

అయితే ప్రస్తుతం అన్ని దేశాల కంటే భారత క్రికెట్ బోర్డు అత్యధిక ఆదాయం కలిగివుంది...  అలాగే ఐసిసిలో చాలా బలమైన బోర్డు ఇది. ఇక భారత్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ మ్యాచ్ అంటే కాసుల వర్షం ఖాయం. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ నుండి భారత్ తప్పుకుంటే అటు ఐసిసి, ఇటు పిసిబికి భారీ నష్టం తప్పదు.

ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోమంటే ఆ టోర్నీని మరో చోటికి తరలించే కూడా ఐసిసి సిద్దపడుతుంది... ఇదే జరిగితే పిసిబికి ఏకంగా రూ.296 కోట్ల నష్టం వస్తుందని అంచనా. అందువల్లే టిమిండియా షరతులకు తలొగ్గింది పాక్. భారత్ ఆడే మ్యాచులను ఇతర దేశాల్లో నిర్వహించేందుకు సిద్దమయ్యింది. 

Latest Videos

click me!