క్రికెట్‌ని కూడా రాజకీయం చేసేశారు... సంజూ శాంసన్ చిన్ననాటి కోచ్ సంచలన వ్యాఖ్యలు...

First Published Nov 30, 2022, 10:38 AM IST

టీమిండియాలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది సంజూ శాంసన్ గురించే! సంజూ శాంసన్‌కి ఛాన్సులు ఇవ్వకుండా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతూ వరుసగా ఫెయిల్ అవుతున్న రిషబ్ పంత్‌కి లెక్కలేనన్ని అవకాశాలు ఇస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్...

Sanju Samson and Rishabh Pant

ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌, న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 38 బంతుల్లో 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయినా ఆ తర్వాత రెండు వన్డేల్లో చోటు దక్కించుకోలేకపోయాడు... రిషబ్ పంత్ రెండు మ్యాచుల్లో కలిపి 39 బంతులు ఆడి 25 పరుగులు చేస్తే... సంజూ శాంసన్ ఒక్క మ్యాచ్‌లోనే అతని కంటే ఎక్కువ పరుగులు చేశాడు...

ఫామ్‌లో ఉన్నా, పరుగులు చేస్తున్నా సంజూ శాంసన్‌ని పక్కనబెట్టడానికి అనేక కారణాలు వెతుకుతున్నారు నెటిజన్లు... సంజూ శాంసన్, దక్షిణా భారతదేశానికి చెందిన వాడు కావడం వల్లే అతనికి టీమిండియాలో చోటు దక్కడం లేదని కొందరు ఆరోపిస్తే, మరికొందరు కులం, మతం వంటి వాటిని తీసుకొస్తూ బీసీసీఐని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు చేస్తున్న వారిపై ఫైర్ అయ్యాడు సంజూ శాంసన్ చిన్ననాటి కోచ్ బిజూ జార్జ్...

Sanju Samson-Shreyas Iyer

‘సంజూ శాంసన్‌కి అవకాశాలు రావడం లేదు, అది కరెక్టే. కానీ ఈ మల్లూ జనాలు, సంజూ శాంసన్‌కీ, బీసీసీఐకీ మధ్య పుల్లలు పెడుతున్నారు. రిషబ్ పంత్‌ని తిడుతూ శాంసన్‌కి ఛాన్స్ ఇవ్వకపోవడానికి పిచ్చి పిచ్చి కారణాలు వెతుకుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు...

Sanju Samson

కేరళలో రాజకీయాల నాయకులు కూడా క్రికెట్‌ని రాజకీయం చేసేశారు. సంజూ శాంసన్‌పై వివక్ష చూపిస్తున్నారని, అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ, పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కొన్ని సార్లు ఎంత టాలెంట్ ఉన్నా, రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి ఉంటుంది...

Sanju Samson

సరైన సమయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. సంజూ శాంసన్ విషయంలో జరుగుతుందీ అదే. అతన్ని కావాలని ఎవ్వరూ తప్పించడం లేదు. భారత క్రికెట్ జట్టులో ఓ ప్లేయర్ ఇలా టార్గెట్ చేయబడతారని నేను అనుకోవడం లేదు. ఒక్క ప్లేయర్‌కి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇండియన్ క్రికెట్ సిస్టమ్‌నే తప్పు బట్టడం కరెక్ట్ కాదు..

Sanju Samson

అదీకాకుండా ప్రస్తుతం టీమిండియాకి కోచ్‌గా ఉన్నది వీవీఎస్ లక్ష్మణ్. అతను సౌత్ వాడు కాదా?   టీమిండియా మెయిన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా సౌత్ వాడే కదా. ఆఖరికి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నది కూడా దక్షిణ భారతీయుడే. కాబట్టి మనవాళ్లకి అవకాశాలు రాలేదని అడ్డమైన ఆరోపణలు చేయడం ఆపండి...’ అంటూ వ్యాఖ్యానించాడు సంజూ శాంసన్ చిన్ననాటి కోచ్ బిజూ జార్జ్...

click me!