కోహ్లీ నాకోసం దాన్ని త్యాగం చేశాడు, అది ఎప్పటికీ మరువను... సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్ కామెంట్...

First Published Nov 18, 2021, 3:34 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. భారత జట్టుకి అద్వితీయ విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, ఐసీసీ టైటిల్ మాత్రం గెలవలేకపోయారు. తాజాగా సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు...

జైపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ కెఎల్ రాహుల్ 15 పరుగులకే అవుటైనా సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు.

కెప్టెన్ రోహిత్ శర్మ 48 పరుగుల వద్ద అవుటైనా సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసి టీమిండియాని విజయ తీరాలకు చేర్చాడు. 

ఈ ఇన్నింగ్స్ కారణంగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సూర్యకుమార్ యాదవ్, మ్యాచ్ అనంతరం కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

‘బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇక్కడే ఆడాలనే కండీషన్స్ ఏమీ నేను పెట్టుకోలేదు. ఓపెనింగ్ నుంచి ఏడో స్థానం వరకూ ఎక్కడ బ్యాటింగ్ చేయమన్నా, సంతోషంగా చేస్తాను.,..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున మూడేళ్లుగా వన్‌ డౌన్‌లో బ్యాటింగ్ చేస్తున్నా. కాబట్టి ఈ పొజిషన్‌లో బ్యాటింగ్ చేయడం నాకు కొత్తగా అనిపించలేదు...

నేను ఫార్మాట్‌కి తగ్గట్గుగా, పరిస్థితులను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయాలని అనుకుంటా. కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నించను. నాలా నేను ఉంటూ, గేమ్‌ను ఎంజాయ్ చేస్తా...

నెట్స్‌లోనే నేను ఎక్కువ ప్రెషర్ తీసుకుంటా. సాధ్యమైనంత ఎక్కువ సేపు ప్రాక్టీస్‌ చేస్తా, మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాలంటే ఏం చేయాలని సాధన చేస్తూ ఉంటాను... అది నా బ్యాటింగ్‌కి సాయం అవుతోంది...

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వెన్ను నొప్పి కారణంగా మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను. వరల్డ్‌కప్ టోర్నీలో నాదైన ముద్ర వేసుకోవాలని భావించాను, కానీ అది వీలు కాలేదు...

నేను మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ తన వన్‌డౌన్ ప్లేస్‌ని నా కోసం త్యాగం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తాను టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు...

అలాగే నమీబియాతో మ్యాచ్ సమయంలోనూ నా దగ్గరికి వచ్చి, ‘నువ్వు వెళ్తావా?’ అని అడిగాడు. తప్పకుండా... అని చెప్పాను. అది కెప్టెన్‌గా తనకి చివరి మ్యాచ్... అయినా సరే నన్ను బ్యాటింగ్‌కి పంపాడు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశా. అతను ప్రతీ ప్లేయర్‌ సక్సెస్‌ని తనదిగా భావిస్తాడు. ఐపీఎల్‌లో ఆడడం వేరు, టీమిండియాకి ఆడడం వేరు...’ అంటూ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...

ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్..

click me!