ఆ ఇద్దరూ అదరగొట్టారు, కానీ ఆ ఒక్కటీ చేసి ఉంటేనా... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలపై కపిల్ దేవ్...

First Published Nov 18, 2021, 2:49 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో పాటు భారత క్రికెట్‌లో ఓ శకానికి తెర పడింది. కోచ్‌గా రవిశాస్త్రి, టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకానికి ముగింపు పడింది. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఈ పాత కోచ్‌పై, కెప్టెన్ కాంబినేషన్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..

‘నా ఉద్దేశంలో విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి జోడి భారత జట్టుకి చేసిన సేవలు ఎంతో విలువైనవి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఇద్దరూ అదరగొట్టారు. అయితే టీమిండియా ఐసీసీ టోర్నీ గెలవలేకపోయింది...

ఐసీసీ టోర్నమెంట్స్ గెలవలేకపోయినా గత ఐదేళ్లలో భారత జట్టు పర్పామెన్స్ చూస్తే, చాలా మెరుగైంది. ఏ లోపం లేకుండా టీమిండియా అన్ని విభాగాల్లోనూ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది...

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఏదైనా మిస్ అయ్యిందంటే, అది ఐసీసీ ట్రోఫీయే. ఆ ఒక్కదాన్ని పక్కనబెడితే రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కాంబినేషన్‌లో టీమిండియా... ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో విజయాలు అందుకుంది...

అంతేనా ఏ దేశంలో అడుగుపెట్టినా ప్రత్యర్థిపై విజయాలను అందుకున్నారు. విదేశాల్లో ఈ స్థాయిలో విజయాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు..

వరల్డ్‌ కప్‌లో ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించకపోవడం చాలా నిరుత్సాహపరిచింది. 2007 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీ తర్వాత, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా పర్పామెన్స్ తీవ్రంగా నిరుత్సాహపరిచింది...

ఒకవేళ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించి, సెమీస్‌లో ఓడిపోయినా ఇంత బాధ ఉండేది కాదేమో. కనీసం టాప్ 4లోకి కూడా రానప్పుడు విమర్శలను ఎదుర్కోక తప్పదు...

గెలిచిన ట్రోఫీల ఆధారంగానే కెప్టెన్సీని నిర్ణయిస్తే, ఆ విషయంలో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినట్టే కానీ దాన్ని పక్కనబెట్టి గత ఐదేళ్లలో భారత జట్టు ఆడిన బ్రాండ్ క్రికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే కోహ్లీ, శాస్త్రి సూపర్ సక్సెస్ అయ్యారు...

నేనైతే విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి ద్వయానికి నూటికి 90 మార్కులు ఇస్తాను. ఆ 10 మార్కులు కూడా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం వల్ల తగ్గించాను. అది గెలిచి ఉంటే వాళ్లు సెంట్ పర్సెంట్ మార్కులు కొట్టేసేవాళ్లు..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్... 

విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కాంబినేషన్‌లో 2019 వన్డే వరల్డ్‌ కప్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ఓడిన టీమిండియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 ఫైనల్‌లోనూ న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది...

2021 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా మూడు విజయాలు అందుకున్న ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది...

click me!