హార్ధిక్ పాండ్యా కోసమే వెంకటేశ్ అయ్యర్‌ని సరిగా వాడుకోవడం లేదా... రోహిత్ శర్మ కెప్టెన్సీపై...

Published : Nov 18, 2021, 12:42 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగియడంతో టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకానికి తెర పడింది. కెప్టెన్‌గా టీ20 పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే రోహిత్ చేసిన కొన్ని పనులు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి...

PREV
112
హార్ధిక్ పాండ్యా కోసమే వెంకటేశ్ అయ్యర్‌ని సరిగా వాడుకోవడం లేదా... రోహిత్ శర్మ కెప్టెన్సీపై...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో ఓ సంచలనంగా వెలుగులోకి వచ్చాడు వెంకటేశ్ అయ్యర్. ఫస్టాఫ్‌లో నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్ కేకేఆర్‌కి ఓపెనర్లుగా వ్యవహరించారు...

212

ఈ ఇద్దరూ వేగంగా పరుగులు చేయలేకపోవడంతో నీరసంగా సాగింది కేకేఆర్ ఇన్నింగ్స్. ‘కేకేఆర్ బ్యాటింగ్ చూస్తూ నిద్రపోయా...’ అంటూ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా బ్యాటింగ్‌పై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు.

312
Venkatesh Iye

అలాంటి కేకేఆర్ కథను మార్చిన ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్. నితీశ్ రాణా స్థానంలో ఓపెనర్‌గా ప్రమోషన్ తెచ్చుకున్న వెంకటేశ్ అయ్యర్, 10 మ్యాచుల్లో 390 పరుగులు చేసి అదరగొట్టాడు...

412

ఒకే ఏడిషన్‌లో అబుదాబీ, దుబాయ్, షార్జాలలో హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన వెంకటేశ్ అయ్యర్, 140+ కి.మీ.ల వేగంతో బంతులు విసిరి పర్పెక్ట్ ఆల్‌రౌండర్‌గా కనిపించాడు...

512

ఈ మెరుపు పర్ఫామెన్స్ కారణంగానే న్యూజిలాండ్‌తో సిరీస్‌కి వెంకటేశ్ అయ్యర్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు. మొదటి టీ20 మ్యాచ్‌లో అయ్యర్, అంతర్జాతీయ ఆరంగ్రేటం కూడా చేశాడు...

612

అయితే అతనితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు రోహిత్ శర్మ. అదీకాక ఓపెనర్‌గా అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్‌ని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి పంపించింది టీమిండియా. 

712

ఈ రెండు సంఘటనలు చూస్తుంటే వెంకటేశ్ అయ్యర్‌ను సరిగా వాడుకోవాలనే ఆలోచన కూడా రోహిత్ శర్మ లేనట్టు కనిపించింది. రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, అయ్యర్‌ని కనీసం వన్‌డౌన్‌లో అయినా పంపేవాడే...

812

సిరాజ్, దీపక్ చాహార్ పరుగులు సమర్పిస్తున్నా, రెండో వికెట్‌కి న్యూజిలాండ్ 100+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా అయ్యర్‌కి బౌలింగ్‌ ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్...

912

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ, తన జట్టు సభ్యుడైన హార్ధిక్ పాండ్యా స్థానాన్ని కాపాడేందుకే వెంకటేశ్ అయ్యర్ విషయంలో పక్షపాత ధోరణి చూపిస్తున్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి...

1012

వెంకటేశ్ అయ్యర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌‌గా సక్సెస్ అయితే హార్ధిక్ పాండ్యాకి జట్టులో స్థానం కరువవుతుంది. ఇప్పటికే సరైన ఫిట్‌నెస్ లేక బౌలింగ్ చేయలేక, చేసినా వికెట్లు తీయలేకపోతున్న పాండ్యా... అయ్యర్ సక్సెస్ అయితే రిజర్వు బెంచ్‌లో చోటు దక్కించుకోవడం కూడా కష్టమే...

1112

అందుకే హార్ధిక్ పాండ్యా స్థానాన్ని కాపాడడం కోసం వెంకటేశ్ అయ్యర్‌ని ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నంలా రోహిత్ ధోరణి కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు కేకేఆర్ ఫ్యాన్స్...

1212

అయితే ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై స్పందించాడు. ‘వెంకటేశ్ అయ్యర్‌కి వచ్చే మ్యాచుల్లో బౌలింగ్ చేసే అవకాశం రావచ్చు. ఐదుగురు బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తున్నప్పుడు వారి రిథమ్‌ని పాడుచేయడం ఇష్టం లేకనే ఆరో బౌలింగ్ ఆప్షన్‌ని వాడలేదు..’ అంటూ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...

Read more Photos on
click me!

Recommended Stories