నాలుగేళ్ల తర్వాత జయంత్ యాదవ్ రీఎంట్రీ... మరి కరణ్ నాయర్ రీఎంట్రీకి ఎన్నేళ్లు...

First Published Dec 3, 2021, 2:06 PM IST

కాన్పూర్ టెస్టులో ఆఖరి వికెట్ తీయలేక, డ్రాతో సరిపెట్టుకున్న భారత జట్టు.. రెండో టెస్టులో ఏకంగా మూడు మార్పులతో బరిలో దిగింది. అజింకా రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా గాయపడడంతో వారి స్థానాల్లో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్‌లకు చోటు దక్కింది...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడే జయంత్ యాదవ్‌కి ఇది ఐదో టెస్టు. 2016 సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు జయంత్ యాదవ్...

కివీస్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికైనా, తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన జయంత్ యాదవ్, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టు ఆరంగ్రేటం చేశాడు...

మొయిన్ ఆలీని డీఆర్‌ఎస్ ద్వారా అవుట్ చేసి, తొలి అంతర్జాతీయ వికెట్ సాధించిన జయంత్ యాదవ్, తన మూడో టెస్టులో 9వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి సెంచరీ బాదాడు..

విరాట్ కోహ్లీతో కలిసి 8వ వికెట్‌కి 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జయంత్ యాదవ్, ఈ వికెట్‌కి రెండో అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేసి రికార్డు సృష్టించాడు..

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 196 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ చేసిన జయంత్ యాదవ్, టీమిండియా తరుపున ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

ఇంతకుముందు 1965లో న్యూజిలాండ్‌పై చెన్నైలో ఫరూక్ ఇంజనీర్ 9వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి చేసిన 90 పరుగుల రికార్డును జయంత్ యాదవ్‌ చెరిపివేశాడు...

తన మొదటి టెస్టులో 55 పరుగులు చేసిన జయంత్ యాదవ్, తన కెరీర్‌లో 4 టెస్టుల్లో 11 వికెట్లు తీసి మంచి ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని అనిపించాడు...

అయితే అంతలోనే జయంత్ యాదవ్‌కి టీమ్‌లో చోటు కరువైంది. చివరిగా 2017లో టీమిండియా తరుపున టెస్టు మ్యాచ్ ఆడిన జయంత్ యాదవ్, నాలుగేళ్ల తర్వాత తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు...

జయంత్ యాదవ్ రీఎంట్రీతో భారత యంగ్ త్రిబుల్ సెంచరీ బ్యాట్స్‌మెన్‌ కరణ్ నాయర్ రీఎంట్రీ ఎప్పుడిస్తాడా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

2016 నవంబర్ 26న మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన కరణ్ నాయర్, ఆ తర్వాత మూడో టెస్టులో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ 199 పరుగుల వద్ద అవుటై, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు...

ఓవరాల్‌గా తన మూడో టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కరణ్ నాయర్ 381 బంతుల్లో 32 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79.53 స్ట్రైయిక్ రేటుతో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు..

భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత త్రిబుల్ సెంచరీ మార్కు అందుకున్న రెండో ప్లేయర్ కరణ్ నాయర్...

అంతేకాకుండా తన టెస్టు కెరీర్‌లో మూడో ఇన్నింగ్స్‌లో త్రిశతకం బాదిన కరణ్ నాయర్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు...

తన తొలి టెస్టు సెంచరీనే త్రిశతకంగా మార్చిన మూడో క్రికెటర్‌గా, మొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన కరణ్ నాయర్, ఆ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు...

జయంత్ యాదవ్ మాదిరిగినే కరణ్ నాయర్ కూడా చివరిగా 2017లోనే ఆస్ట్రేలియాపై మ్యాచ్ ఆడాడు. 6 మ్యాచుల్లో ఓ త్రిబుల్ సెంచరీ సాధించిన కరణ్ నాయర్‌కి తిరిగి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...

click me!