వాళ్లు ఫైనల్ ఆడి ఇక్కడికి వచ్చారు, సిరీస్ క్లీన్ స్వీప్ చేసినా... టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్...

Published : Nov 22, 2021, 12:24 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజీకి పరిమితమై, స్వదేశానికి తిరిగి వస్తే, న్యూజిలాండ్ ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ 2021 టోర్నీలో ఎదురైన పరాభవానికి క్లీన్‌స్వీప్‌తో ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు...

PREV
112
వాళ్లు ఫైనల్ ఆడి ఇక్కడికి వచ్చారు, సిరీస్ క్లీన్ స్వీప్ చేసినా... టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్...

ఈ టీ20 సిరీస్ ద్వారా పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, భారత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్నారు. వీరిద్దరికీ ఫుల్‌టైమ్ కెప్టెన్, హెడ్‌కోచ్‌లుగా ఇదే మొదటి సిరీస్...

212

‘హెడ్‌కోచ్‌గా మొదటి సిరీస్‌ను గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్‌లో అందరూ చక్కగా రాణించారు. శుభారంభం దక్కితే, ఆ ఫీల్ చాలా బాగుంటుంది...

312

అయితే మనం వాస్తవాలను గ్రహించాలి. క్లీన్ స్వీప్ చేసినంత మాత్రం కివీస్‌పైన పైచేయి సాధించినట్టు కాదు. ఎందుకంటే వాళ్లు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఆడి ఇక్కడికి వచ్చారు...

412

కేవలం మూడు రోజుల గ్యాప్‌లో టీ20 సిరీస్ ఆడడమంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మెగా టోర్నీ తర్వాత ఆరు రోజుల్లో మూడు మ్యాచులు ఆడారు. వారి కష్టాన్ని మెచ్చుకోవాల్సిందే...

512

ఈ సిరీస్‌, తప్పులను సరి చేసుకోవడానికి ఓ పాఠంగా ఉపయోగపడాలి. ఎందుకంటే రాబోయే రెండేళ్లలో చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. రెండు ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలు ఉన్నాయి...

612

ఈ రెండేళ్లలో విజయాలతో పాటు పరాజయాలు కూడా ఎదురుకావచ్చు. అన్నింటినీ ఫేస్ చేయడానికి భారత జట్టు ప్లేయర్లు సిద్ధంగా ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

712

జైపూర్, రాంఛీ వేదికలుగా జరిగిన మొదటి రెండు టీ20 మ్యాచుల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత జట్టు. కివీస్ విధించిన లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి, విజయాలు అందుకుంది...

812

వరుసగా మూడో టీ20 మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచిన రోహిత్ శర్మ, ఈసారి భారత బ్యాటింగ్ బలాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో తొలుత బ్యాటింగ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు...

912

ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించినా ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఫెయిల్ అయ్యారు...

1012

అయితే వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, ఆఖరి ఓవర్‌లో దీపక్ చాహార్ మెరుపులతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా...

1112

అక్షర్ పటేల్ మూడో ఓవర్‌లో రెండు వికెట్లు తీసి, కివీస్‌కి షాక్ ఇవ్వగా ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 111 పరుగులకు ఆలౌట్ అయ్యింది...

1212

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 111 పరుగులు చేయగా, మూడో టీ20 మ్యాచ్‌లో కివీస్‌ని సరిగా 111 పరుగులకే ఆలౌట్ చేశారు భారత బౌలర్లు..

click me!

Recommended Stories