ఆ విషయంలో ఆవేశ్‌ఖాన్‌కి అన్యాయం... ఎటీ20 సిరీస్ గెలిచినా, ఆఖరి మ్యాచ్‌లో వారికి దక్కని అవకాశం...

First Published Nov 21, 2021, 8:14 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021లో ఎదురైన పరాభవం నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు, వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్‌కి టీమ్‌ను తయారుచేయడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌తో మొదటి టీ20 సిరీస్ ఆడుతోంది...

జైపూర్‌లో జరిగిన మొదటి టీ20 మ్యా,చ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, రాంఛీలో జరిగిన రెండో టీ20లో గెలిచి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది...

టీ20 సిరీస్ ఇప్పటికే గెలవడంతో మూడో టీ20 మ్యాచ్‌లో యంగ్ ప్లేయర్లు రుతరాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్‌లకు అవకాశం దొరుకుతుందని భావించారు క్రికెట్ ఫ్యాన్స్...

అయితే టీ20 కెప్టెన్‌గా తొలి సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా మొదటి సిరీస్ ఆడుతున్న రాహుల్ ద్రావిడ్... నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో కూడా ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలతో 635 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్‌లో ఉన్నా, అతనికి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు...

అలాగే ఐపీఎల్ 2021లో 16 మ్యాచుల్లో 7.37 ఎకానమీతో 24 వికెట్లు తీసి, ‘పర్పుల్ క్యాప్’ విన్నర్ హర్షల్ పటేల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ఆవేశ్ ఖాన్‌కి కూడా అవకాశం రాలేదు...

ఐపీఎల్ ఫస్టాఫ్‌లో విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి హేమాహేమీల వికెట్లు తీసి, సెలక్టర్లను ఇంప్రెస్ చేశారు ఆవేశ్ ఖాన్. ఈ పర్ఫామెన్స్ కారణంగానే ఇంగ్లాండ్ టూర్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు ఆవేశ్ ఖాన్...

ఇంగ్లాండ్ కౌంటీతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన ఆవేశ్ ఖాన్, టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసే అవకాశాన్ని కూడా కోల్పోయి, నిరాశగా స్వదేశానికి తిరిగొచ్చాడు...

ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపిక కావడంతో శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో ఆడలేకపోయాడు ఆవేశ్ ఖాన్. ఐపీఎల్ పస్టాఫ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన చేతన్ సకారియా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి వంటి ప్లేయర్లకు శ్రీలంక టూర్‌లో అవకాశం దక్కింది...

ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టుకి నెట్‌బౌలర్‌గా వ్యవహరించిన ఆవేశ్ ఖాన్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ కోసం స్వదేశానికి తిరిగి వచ్చాడు..

టీమిండియాలో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆవేశ్ ఖాన్, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో ఆరంగ్రేటం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే అతనికి ఆ అవకాశం దక్కలేదు...

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడిన తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో టీ20, వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ టూర్‌కి భారత జట్టును త్వరలో ఎంపిక చేయనుంది టీమిండియా...

ఆ టూర్‌లో విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు రీఎంట్రీ ఇస్తుండడంతో రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్‌ వంటి యంగ్ ప్లేయర్లకు అవకాశం దక్కుతుందా? అనేది అనుమానమే.. 

click me!