అతన్ని సరిగా వాడుకుంటే, ఫ్యూచర్‌లో కోహ్లీలా మారతాడు... భారత యంగ్ క్రికెటర్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్...

First Published Nov 17, 2021, 7:47 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఫెయిల్ అయిన భారత జట్టు, గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీకి జట్టుని తయారుచేయడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌తో రోహిత్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ ఆడుతోంది భారత జట్టు...

రాహుల్ ద్రావిడ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడంతో ఈ టూర్‌ ద్వారా కొత్త కుర్రాళ్లు ఆరంగ్రేటం చేసే అవకాశం ఉంది... ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ ద్వారా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఆరంగ్రేటం చేశాడు.

హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ వంటి యంగ్ పేసర్లు ఆరంగ్రేటం చేస్తున్నా, అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ప్లేయర్ మాత్రం యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్... 

ఐపీఎల్ ద్వారా టీమిండియాలో చోటు దక్కించుకున్నవారిలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. గత ఏడాది లేటుగా ఎంట్రీ ఇచ్చినా వరుసగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన రుతురాజ గైక్వాడ్, ఈ ఏడాది ఏకంగా ఆరెంజ్ క్యాప్ గెలిచాడు...

అతి పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైనా ఐపీఎల్ 2021 సీజన్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ పర్ఫామెన్స్ కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌లో రుతురాజ్‌కి అవకాశం దక్కింది...

‘చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో రుతురాజ్ గైక్వాడ్ కీ రోల్ పోషించాడు. ఐపీఎల్‌లో అతను బ్యాటు నుంచి కొన్ని బెస్ట్ ఇన్నింగ్స్‌లు చూశాం...

అబుదాబీలో రుతురాజ్ చేసిన సెంచరీ అయితే సెన్సేషనల్... రుతురాజ్ గైక్వాడ్‌ని టీమిండియా సరిగా వినియోగించుకుంటే, అతను ఫ్యూచర్ స్టార్‌గా మారతాడు...

కరెక్టుగా వాడుకుంటే మరో విరాట్ కోహ్లీలా పరుగుల వరద పారించగలడు. సీఎస్‌కే కోచ్ మైకెల్ హుస్సీ, నాకు రుతురాజ్ గైక్వాడ్ గురించి కొన్నేళ్ల క్రితమే చెప్పాడు. అతనో గన్‌లా ఆడుతున్నాడని చెప్పాడు...

అతని బ్యాటింగ్ చూడండి. వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా అతను ఎంతో చక్కగా ఎదుర్కొంటున్నాడు. తన బ్యాటుతో మ్యాజిక్ చేస్తున్నాడు. నా వరకూ అతను ఇప్పుడే 10కి 9 మార్కులు కొట్టేశాడు...

అతను తన టాలెంట్‌ని మరింత సాన పెడితే, టాప్ ప్లేయర్ అవుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ కూడా చూడడానికి క్లాస్‌గా ఉంటుంది...

తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్ కెరీర్‌లో ఫెయిల్ అయిన సందర్భాలు ఎక్కువే కావచ్చు, కానీ క్లిష్ట సమయాల్లో అతని బ్యాటు నుంచి వచ్చిన కొన్ని ఇన్నింగ్స్‌లు అద్వితీయమైనవి...

శ్రేయాస్ అయ్యర్‌కి కూడా నేను 10కి 9 మార్కులు ఇస్తా. అయితే త్వరలోనే అతను 10కి 10 తెచ్చుకుంటాడు. టాప్ 4లో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ ఉండాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్...
 

click me!