అతను ముందే చెప్పాడు, నేనే నమ్మలేదు... హర్భజన్ సింగ్‌పై వెంకటేశ్ అయ్యర్ కామెంట్...

First Published Nov 19, 2021, 5:33 PM IST

ఐపీఎల్ ద్వారా ఎంతో మంది క్రికెటర్లు, టీమిండియాలోకి వచ్చారు స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు భారత జట్టులో స్టార్లుగా వెలుగొందుకున్న జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, నటరాజన్ వంటి ప్లేయర్లకు టీమిండియాలోకి రూట్ వేసింది ఐపీఎల్ పర్ఫామెన్స్...

ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్లలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో ఆరంగ్రేటం చేసిన వెంకటేశ్ అయ్యర్, వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంటూ ఒడిసి పట్టుకున్నాడు...

ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఏడు మ్యాచుల్లో రెండే రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్, కేకేఆర్ కథను మార్చేశాడు...

10 మ్యాచుల్లో 390 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, 4 హాఫ్ సెంచరీలతో కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరడంలో, ఆ తర్వాత ఫైనల్‌కి దూసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు...

సీఎస్‌కేతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి, ధోనీ సేన గుండెల్లో గుబులు రేపిన వెంకటేశ్ అయ్యర్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు...

ఐపీఎల్ 2021 పర్ఫామెన్స్ కారణంగా వెంకటేశ్ అయ్యర్‌ని టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేయాలని ప్రయత్నాలు జరిగినా, మెంటర్ ఎమ్మెస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో అది వీలు కాలేదని టాక్ వినిపించింది...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి నెట్ బౌలర్‌గా ఎంపికైన వెంకటేశ్ అయ్యర్, న్యూజిలాండ్‌తో జైపూర్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు...

తాను ఎదుర్కొన్న మొట్టమొదటి అంతర్జాతీయ బంతికే ఫోర్ బాదిన వెంకటేశ్ అయ్యర్, ఆ తర్వాతి బంతికి అనవసర షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు..

‘ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే సీనియర్ ప్లేయర్ హర్భజన్ సింగ్ భయ్యాతో నేను మాట్లాడాను. ఆయన నన్ను ప్రాక్టీస్ సెషన్స్‌లో బాగా గమనించారు...

ఆ సమయంలోనే ‘ఈసారి కేకేఆర్ అంటే నువ్వే, నువ్వు ఇరగదీస్తావ్ చూడు... ’ అంటూ నాతో అన్నారు భజ్జీ. ఆ మాటలు విని నేను కొంచెం షాక్ అయ్యాను. సీనియర్ ప్లేయర్ అలా చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది...

అయితే హర్భజన్ సింగ్, నాలో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచడానికే అలా చెబుతున్నారని అర్థం చేసుకున్నా. ఆయన నమ్మకాన్ని పోగొట్టకూడదని ఛాన్స్ వచ్చినప్పుడు చెలరేగిపోయా...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో నా పర్ఫామెన్స్‌, నాకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చింది. భజ్జీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు మరింత సంతోషించా...’ అంటూ కామెంట్ చేశాడు వెంకటేశ్ అయ్యర్...

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఊహించని విధంగా ప్లేఆఫ్స్‌కి చేరిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, మొదటి ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీని, రెండో క్వాలిఫైయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి ఫైనల్ చేరింది. 

అయితే ఫైనల్ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సీఎస్‌కే చేతుల్లో ఓడింది.  

click me!