మంచి ఫామ్‌లో ఉన్నాడు, అతన్ని ఎందుకు ఆడించడం లేదు... టీమిండియాపై విటోరీ, రాబిన్ ఊతప్ప ఫైర్...

First Published Nov 19, 2021, 4:59 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో భారత ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20ల్లో టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న చాహాల్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది...

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన యజ్వేంద్ర చాహాల్, 18 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయినా కూడా చాహాల్‌ని టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టులో చేర్చలేదు సెలక్టర్లు..

యజ్వేంద్ర చాహాల్‌ని కాదని పొట్టి ప్రపంచకప్‌కి ఎంపిక చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. మూడు మ్యాచుల్లో వికెట్లేమీ తీయకపోయినా భారీగా పరుగులు సమర్పించాడు.

న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో యజ్వేంద్ర చాహాల్ కూడా ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆడిన వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్‌లకు తప్పించి చాహాల్‌కి చోటిచ్చారు సెలక్టర్లు...

అయితే జైపూర్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో యజ్వేంద్ర చాహాల్‌కి తుది జట్టులో అవకాశం దక్కలేదు. చాహాల్‌కి బదులుగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఆడించాడు రోహిత్ శర్మ...

‘యజ్వేంద్ర చాహాల్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. అతన్ని ఎందుకు ఆడించడం లేదో అర్థం కావడం లేదు. అయితే చాహాల్ కోసం అక్షర్ పటేల్‌ని పక్కనబెట్టడం కరెక్ట్ కాదు...

అక్షర్ పటేల్‌కి మరో మ్యాచ్ అవకాశం ఇచ్చి, ఆ తర్వాత యజ్వేంద్ర చాహాల్‌ని ఆడిస్తే బెటర్ అనుకుంటా. లేదా రవిచంద్రన్ అశ్విన్ ఎలాగో బిజీ క్రికెట్ ఆడబోతున్నాడు కాబట్టి అతని స్థానంలో చాహాల్‌కి ప్లేస్ ఇస్తే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు సీనియర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప...

‘యజ్వేంద్ర చాహాల్, టీమిండియా కోసం ఎన్నో మ్యాచులను గెలిపించాడు. టీ20 ఫార్మాట్‌కి అతను పర్పెక్ట్ బౌలర్. రోహిత్ శర్మ, చాహాల్‌ని ఓ అటాకింగ్ ఆయుధంగా వాడాలి...

టీమిండియాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో యజ్వేంద్ర చాహాల్ చాలా మంచి ఆప్షన్ అవుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియల్ విటోరీ...

click me!