ధోనీ వెనకే రైనా, ఏబీ డివిల్లియర్స్‌తో పాటు విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ ఫ్రెండ్స్‌పై సీఎస్‌కే ఫ్యాన్స్‌...

First Published Nov 19, 2021, 3:20 PM IST

సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్, ‘మిస్టర్ 360 డిగ్రీస్’ ఏబీ డివిల్లియర్స్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ, రిటైర్మెంట్ ప్రకటించాడు. మిగిలిన లీగ్‌ల సంగతి ఎలా ఉన్నా, ఏబీ డివిల్లియర్స్ నిర్ణయం, ఐపీఎల్‌లో ఆర్‌సీబీని తీవ్రంగా ప్రభావితం చేయనుంది...

కెరీర్ ఆరంభంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరుపున ఏబీ డివిల్లియర్స్, 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి వచ్చాడు. అప్పటి నుంచి ఆర్‌సీబీకి కీలక ఆటగాడిగా మారిపోయాడు ఏబీడీ...

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్ వంటి సూపర్ స్టార్లను కూడా వేలానికి వదిలేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఏబీడీని మాత్రం రిటైన్ చేసుకుంటూ వచ్చింది...

ఐపీఎల్‌లో మూడు సెంచరీలు చేసిన ఏబీ డివిల్లియర్స్, ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆప్తమిత్రుడిగా మారాడు. ఈ ఇద్దరూ కలిసి ఐపీఎల్‌లో అనేక రికార్డులు సృష్టించి, జట్టుకి అనేక విజయాలు అందించారు. 

ఐపీఎల్‌లో 184 మ్యాచులు ఆడి 151.68 స్ట్రైయిక్ రేటుతో 39.70 సగటుతో 5162 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్, 180 మ్యాచులకు పైగా ఆడిన అతికొద్ది ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు. 

అయితే ఏబీ డివిల్లియర్స్ ఫ్రాంఛైజీ క్రికెట్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించిన వేళ, సురేష్ రైనా పేరు ట్రెండింగ్‌లో కనిపించింది. అసలు రైనాకి, ఏబీ డివిల్లియర్స్‌కి ఉన్న సంబంధం ఏంటి?

ఏబీ డివిల్లియర్స్- విరాట్ కోహ్లీ జోడిలాగే, చెన్నై సూపర్ కింగ్స్‌లో సురేష్ రైనా-మహేంద్ర సింగ్ ధోనీ జోడి కూడా మంచి మిత్రులుగా, ఆప్తులుగా గుర్తింపు తెచ్చుకున్నారు...

2020 ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన వెంటనే, ‘నేను నీ వెంటే నడుస్తా’ అంటూ సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు..

ఇప్పుడు ఏబీ డివిల్లియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి ఆప్తమిత్రుడైన విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ రైనాని ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్...

అలాగే తాను ఐపీఎల్ ఆడితే, సీఎస్‌కే జట్టుకి మాత్రమే ఆడతానని లేదంటూ, ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించాడు సురేష్ రైనా...

ఇప్పుడున్న పరిస్థితుల్లో సురేష్ రైనాని రిటైన్ చేసుకోవడం అసాధ్యమే. మహేంద్ర సింగ్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహార్, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లను సీఎస్‌కే రిటైన్ చేసుకోబోతుందని టాక్ వినబడుతోంది.

మాహీకి కలిసి ఆడకపోతే, ఐపీఎల్ ఆడనని ప్రకటించిన సురేష్ రైనా, ఈసారి వేరే జట్టుకి వెళ్లడం ఖాయం.  అదే జరిగితే విరాట్ కోహ్లీ-ఏబీ డివిల్లియర్స్ జోడీతో పాటు సురేష్ రైనా- ఎమ్మెస్ ధోనీ ద్వయాన్ని చూసే అవకాశం కూడా అభిమానులకు దక్కదు..

2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఏబీ డివిల్లియర్స్. 2019 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీలో సౌతాఫ్రికా ఘోర పరాజయాలు ఎదుర్కొంది...

దీంతో అవసరమైతే కమ్‌బ్యాక్ ఇస్తానని సౌతాఫ్రికా బోర్డుకు ఆఫర్ ఇచ్చాడు ఏబీడీ. అయితే అప్పుడు సౌతాఫ్రికా బోర్డు దాన్ని తిరస్కరించింది. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఏబీడీని ఆడించాలని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేసినా, అవి సఫలం కాలేదు..

click me!