హార్ధిక్ పాండ్యాకి అసలైన పరీక్ష... న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిస్తే, టీమిండియా టీ20 కెప్టెన్సీ!...

Published : Nov 18, 2022, 12:28 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీ ఫైనల్ మ్యాచుల్లో ఓడిన ఇండియా, న్యూజిలాండ్ జట్లు... మెగా టోర్నీ ముగిసిన తర్వాత టీ20 సిరీస్‌లో పాల్గొంటున్నాయి. వరల్డ్ కప్ పరాజయ ప్రభావంతో ఈ సిరీస్‌ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి తోడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు లేకుండా జరుగుతోందీ సిరీస్...

PREV
16
హార్ధిక్ పాండ్యాకి అసలైన పరీక్ష... న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిస్తే, టీమిండియా టీ20 కెప్టెన్సీ!...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీ20 వరల్డ్ కప్ 2022 మెగా టోర్నీలో రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ ఇద్దరూ ప్రస్తుత సిరీస్‌లో పాల్గొనడం లేదు....

26
Image credit: Getty

విరాట్ కోహ్లీతో పాటు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొన్న రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు కూడా ఈ టీ20 సిరీస్‌కి ఎంపిక కాలేదు. దీంతో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్ వంటి కుర్రాళ్లు... ఈ టీ20 సిరీస్‌లో కీలకంగా మారబోతున్నారు...

36
Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ కారణంగా అభిమానులు ఈ సిరీస్‌ని పట్టించుకోవడం లేదు. అదీకాకుండా ఈ టీ20 సిరీస్‌ హాట్ స్టార్‌లో  ప్రసారం కావడం లేదు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్కిప్షన్ ఉన్నవారు మాత్రమే లైవ్ మ్యాచులు చూసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో కాస్తో కూస్తో ఈ టీ20 సిరీస్‌ చూసేందుకు ఆసక్తి ఉన్నవాళ్లూ కూడా పట్టించుకోవడం లేదు...

46

ఎవ్వరూ పట్టించుకోని  ఈ సిరీస్, భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి పరీక్షగా మారింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2024లో టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఉండడం, అప్పటి వరకూ రోహిత్ శర్మ క్రికెట్‌లో కొనసాగే అవకాశాలు లేకపోవడంతో పొట్టి ఫార్మాట్‌కి కొత్త కెప్టెన్‌ని వెతికే పనిలో పడింది టీమిండియా...

56

ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యాని టీమిండియా కెప్టెన్‌గా నియమించాలని చాలామంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో హార్ధిక్ పాండ్యాకి ఈ టీ20 సిరీస్ కెప్టెన్సీ పరీక్షగా మారింది...

66
Hardik Pandya, rohith sharma

రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ వంటి యంగ్ క్రికెటర్లు కూడా టీమిండియా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. అయితే ఈ ఇద్దరితో పోలిస్తే హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్‌లో టైటిల్ గెలిచి, రేసులో ముందంజలో ఉన్నాడు. న్యూజిలాండ్‌లో టీ20 సిరీస్ కూడా గెలిస్తే, హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ దక్కడం దాదాపు ఖాయమైపోతుంది... 

Read more Photos on
click me!

Recommended Stories