నేటి నుంచే కివీస్‌తో సిరీస్.. ‘స్టార్, డిస్నీ’లో కాదు.. మ్యాచ్‌లను చూడండిలా..

Published : Nov 18, 2022, 10:19 AM IST

IND vs NZ: టీ20 ప్రపంచకప్ తర్వాత ఇండియా, న్యూజిలాండ్  జట్లు తమ  తొలి మ్యాచ్ ను నేడు ఆడనున్నాయి. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు నేరుగా కివీస్ వెళ్లింది. ఈ మ్యాచ్ లను  ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇలా చూడొచ్చు. 

PREV
17
నేటి నుంచే కివీస్‌తో సిరీస్.. ‘స్టార్, డిస్నీ’లో కాదు.. మ్యాచ్‌లను చూడండిలా..

పొట్టి ప్రపంచకప్ లో  సెమీస్ వైఫల్యాల తర్వాత భారత్-న్యూజిలాండ్ లు తిరిగి వారి  వ్యూహాలకు పదునుపెట్టనున్నాయి.   వరల్డ్ కప్ తర్వాత రెండు జట్లూ నేడు తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.  సీనియర్ల గైర్హాజరీతో  టీ20లకు హార్ధిక్ పాండ్యా, వన్డేలకు శిఖర్ ధావన్ లు  భారత జట్టు సారథులుగా వ్యవహరిస్తున్నారు.  న్యూజిలాండ్ కు కేన్ విలియమ్సన్ సారథిగా కొనసాగుతాడు. 

27

2024  టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పట్నుంచే సన్నాహకాలు మొదలుపెడుతున్న భారత్..ఈ సిరీస్ లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు ఇతర ఆటగాళ్ల ఆటను కూడా నిశితంగా పరిశీలించనుంది. ముఖ్యంగా 2024 నాటికి   రాటుదేల్చేందుకు గాను ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శుభమన్ గిల్ వంటి ఆటగాళ్లను సానబెట్టేందుకు  టీమిండియా ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది.  

37

న్యూజిలాండ్ లో కూడా   ప్రమాదకర సీనియర్లు మార్టిన్ గప్తిల్, ట్రెంట్ బౌల్ట్ లు లేకుండానే బరిలోకి దిగుతున్నది. ఆ జట్టులో కూడా దాదాపు యువ ఆటగాళ్లే  ఎక్కువగా ఉన్నారు. భారత్  పూర్తిస్థాయి జట్టును పంపకున్నా కివీస్ మాత్రం పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగుతున్నది.  దీంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగడం ఖాయం. 

47

ఈ పర్యటనలో భారత్..  నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభించనుంది.  నవంబర్18, 20, 22న మూడు టీ20లు జరుగుతాయి.  ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం  మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి.  వన్డేలు నవంబర్ 25,  27, 30న జరుగనుండగా.. అవి ఉదయం 7 గంటలకే మొదలవుతాయి.  

57

అయితే ఇన్నాళ్ల మాదిరిగా  ఈ మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్ లో గానీ డిస్నీ హాట్ స్టార్ లో గానీ  ప్రసారం కావు. భారత్ లో ఈ మ్యాచ్ లు డీడీ స్పోర్ట్స్ టీవీ ఛానెల్ లో లైవ్ వీక్షించొచ్చు. అలాగాక  అమెజాన్ ప్రైమ్ లో కూడా మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. అయితే దీనికి సబ్ స్క్రిప్షన్ మాత్రం తప్పనిసరి.  

67
team India

ఇక భారత్-న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా   జరుగబోయే తొలి టీ20కి వర్షం ముప్పు ఉందని తెలుస్తున్నది. మరి మ్యాచ్ సమయం కల్లా వరుణుడు కరుణిస్తే  ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం తప్పదు. ఈ మ్యాచ్ కు భారత జట్టు అంచనా : శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్, దీపక్ హుడా,  భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్,అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ 

77

న్యూజిలాండ్ జట్టు అంచనా: ఫిన్అలెన్,  డెవాన్ కాన్వే,  కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్,  జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్  సౌథీ,  ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్ 

Read more Photos on
click me!

Recommended Stories