అతని కెరీర్ నాశనం కావడానికి రోహిత్ శర్మే కారణమా... హిట్‌మ్యాన్ కారణంగా టీమిండియాకి దూరమై...

First Published Nov 21, 2021, 7:33 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్‌గా టీమిండియా పగ్గాలు చేపట్టాడు ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ. కెప్టెన్‌గా మూడుకి మూడు మ్యాచుల్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ, అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు...

టీమిండియా తరుపున 2019లో విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ మూడుకి మూడు మ్యాచుల్లో టాస్ గెలిచాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీని టాస్ ఓ గండంలా వెంటాడగా, రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంట్రీ ఇస్తూనే టాస్‌లో హ్యాట్రిక్ కొట్టాడు..

ఓ క్రికెటర్ స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆ స్థానంలో కుదురుకోవడానికి కష్టపడుతున్న ప్లేయర్ల కెరీర్‌ను కష్టాల్లో నెట్టాల్సి వస్తుంది. 

ఎమ్మెస్ ధోనీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా భారత జట్టులో సెటిల్ కావడంతో ఆ స్థానం కోసం పోటీపడిన పార్థివ్ పటేల్, నామన్ ఓజా, దినేశ్ కార్తీక్‌, వృద్ధిమాన్ సాహాలకు తగినన్ని అవకాశాలు రాలేదు...

అలాగే రోహిత్ శర్మ, మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా మారి, నిలకడైన పర్ఫామెన్స్ ఇవ్వడంతో సీనియర్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్ మురళీ విజయ్ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసినట్టైంది...

2008 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గౌతమ్ గంభీర్, షేన్ వాట్సన్‌‌ను ఉద్దేశపూర్వకంగా మోచేతితో తోయడంతో ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు...

దీంతో గౌతమ్ గంభీర్ స్థానంలో నాగ్‌పూర్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై టెస్టు ఎంట్రీ ఇచ్చాడు మురళీ విజయ్. గంభీర్‌పై బ్యాన్ పడడంతో రంజీ ట్రోఫీలో ఆడుతున్న మురళీ విజయ్‌ని అర్ధాంతరంగా టీమిండియాలోకి పిలుపు నిచ్చారు సెలక్టర్లు...

మొదటి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన మురళీ విజయ్, 41 బంతుల్లో 33 పరుగులు చేసి, తొలి వికెట్‌కి 116 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...

‘అతని డిఫెన్సివ్ షాట్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్‌ వర్క్ కూడా బాగుంది. మరీ బలంగా కొట్టాలని కాకుండా, క్లాస్‌గా షాట్స్ ఆడుతున్నాడు. అందుకే ఈ కుర్రాడికి టీమిండియా అవకాశం ఇచ్చినట్టుంది...’ అంటూ మురళీ విజయ్ గురించి కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ ఆలెన్ బోర్డర్...

టీమిండియా తరుపున 61 టెస్టులు ఆడిన మురళీ విజయ్, 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో 38.29 సగటుతో 3982 పరుగులు చేశాడు. 17 వన్డే మ్యాచుల్లో ఓ హాఫ్ సెంచరీతో 339 పరుగులు చేశాడు...

2018 డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన మురళీ విజయ్, 2019లో రోహిత్ శర్మ టెస్టు ఓపెనర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో టీమిండియాకి దూరమయ్యాడు...

టెస్టుల్లో ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, సుదీర్ఘ ఫార్మాట్‌లో సత్తా చాటి తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ బాదాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 212 పరుగులు చేసిన రోహిత్, టెస్టుల్లో ఓపెనర్‌గా తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు...

ఓపెనర్‌గా ఆడిన మొట్టమొదటి టెస్టు సిరీస్‌లో 529 పరుగులు చేసిన రోహిత్ శర్మ, భారత జట్టు 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు...

రోహిత్ శర్మ, టెస్టు ఓపెనర్‌గా సెటిల్ అయిపోగా, అతనికి తోడుగా మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లను మరో ఎండ్ ఓపెనర్లుగా ఎంట్రీ ఇచ్చారు. 

టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ, మురళీ విజయ్ కెరీర్‌ అర్ధాంతరంగా ముగియడానికి కారణమైంది. 37 ఏళ్ల మురళీ విజయ్, గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్‌గా ఆడాడు...

ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో మురళీ విజయ్‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. అదీకాకుండా దేశవాళీ క్రికెట్ లీగుల్లో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపించకపోవడంతో మురళీ విజయ్ కెరీర్‌కి దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్టే...

click me!