అతని బ్యాటింగ్ డిస్సపాయింట్ చేసింది, తన రేంజ్‌కి తగ్గట్టుగా ఆడలేదు... రిషబ్ పంత్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్స్...

First Published Nov 22, 2021, 1:26 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 పరాజయం తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. మొదటి రెండు మ్యాచుల్లో మ్యాచ్ ఫినిషర్ రోల్ పోషించిన రిషబ్ పంత్, మూడో టీ20లో మాత్రం ఫెయిల్ అయ్యాడు...

వరుసగా మూడు మ్యాచుల్లోనూ టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఒకవేళ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే, భారత జట్టు ఎంత స్కోరు చేస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చేందుకు... ఆఖరి టీ20లో ఛేదనకు కాకుండా ఫస్ట్ బ్యాటింగ్‌కి మొగ్గు చూపాడు...

రోహిత్ శర్మ నిర్ణయానికి తగ్గట్టుగానే ఇషాన్ కిషన్, రోహిత్ దూకుడుగా ఆడడంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది టీమిండియా. అదే రేంజ్‌లో దూసుకెళ్తే ఈజీగా 200+ స్కోరు చేస్తుందని భావించారంతా...

Latest Videos


అయితే ఇషాన్ కిషన్ అవుటైన తర్వాత వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ నాలుగు బంతులాడి డకౌట్ కావడం, రిషబ్ పంత్ 6 బంతులు ఆడి 4 పరుగులకే పెవిలియన్ చేరడంతో భారత రన్‌రేట్‌పై ఆ ప్రభావం పడింది...

మొదటి మ్యాచ్‌లో 17 బంతుల్లో 17, రెండో టీ20లో 6 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించిన రిషబ్ పంత్, తన రేంజ్‌కి తగిన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా... 

‘భారత జట్టు, కివీస్‌ని క్లీన్‌స్వీప్ చేసినా భారత మిడిల్ ఆర్డర్‌ లోపాలు స్పష్టంగా కనిపించాయి. రిషబ్ పంత్ కూడా భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు...

మొదటి రెండు మ్యాచుల్లో రిషబ్ పంత్‌కి భారీ ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం దక్కలేదు. అయితే మూడో టీ20లో ఆ అవకాశం వచ్చినా, రిషబ్ పంత్ తన స్టైల్‌ చూపించలేకపోయాడు...

రిషబ్ పంత్, ఈ సిరీస్‌లో రెండో మూడో భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే అతని ఆటతీరు చూస్తుంటే ఇంకా టీ20 మోడ్‌లోకి వచ్చినట్టు కనిపించలేదు. అది కాస్త నిరుత్సాహానికి గురి చేసింది...

టెస్టుల్లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే టీ20ల్లో మాత్రం ఇంకా కుదురుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది... ’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా...

‘టీ20 క్రికెట్‌కి కావాల్సిన టెంపోని రిషబ్ పంత్, ఇంకా అందుకోవడం లేదు. మిడిల్ ఆర్డర్‌లో తన రోల్ ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు అనవసరంగా మరీ ఎక్కువ జాగ్రత్తగా ఆడుతున్నాడు...

మరికొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. తన ఆటలో సరైన రిథమ్ కనిపించడం లేదు. గొప్ప గొప్ప బ్యాట్స్‌మెన్ ఆడుతుంటే వారి బ్యాటింగ్‌లో ఓ నిలకడ, రిథమ్ కనిపిస్తాయి. అదే పంత్‌లో మిస్ అవుతోంది...

రిషబ్ పంత్‌కి టీ20ల్లో ఇంకొంత అనుభవం అవసరం. అప్పుడే తన రోల్‌ ఏంటో గుర్తించగలుగుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ...
 

click me!