హర్భజన్ సింగ్‌ను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్... ముత్తయ్య మురళీధరన్ తర్వాత అత్యంత వేగంగా...

First Published Nov 29, 2021, 2:18 PM IST

కాన్పూర్ టెస్టులో భారత జట్టు విజయం కోసం వికెట్ల వేట సాగిస్తుంటే, న్యూజిలాండ్ జట్టు జిడ్డు బ్యాటింగ్‌తో డ్రా కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది... హోరాహోరీగా సాగుతున్న ఐదో రోజు ఆటలో భారత టెస్టు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ రికార్డు క్రియేట్ చేశాడు...

నాలుగో రోజు మూడో సెషన్‌లో విల్ యంగ్‌ను అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, ఐదో రోజు హాఫ్ సెంచరీ చేసి ప్రమాదకరంగా మారుతున్న మరో ఓపెనర్ టామ్ లాథమ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు...

తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి, పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ 414 టెస్టు వికెట్లను అధిగమించిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డును కూడా అధిగమించాడు...

80 టెస్టుల్లో 418 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే (619 వికెట్లు), కపిల్‌దేవ్ (434 వికెట్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు...

ఓవరాల్‌గా అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఐదో ఆసియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 టెస్టు వికెట్లతో టాప్‌లో ఉండగా, అనిల్ కుంబ్లే 619, కపిల్‌దేవ్ 434, రంగనా హేరాత్ 433 వికెట్లతో అశ్విన్ కంటే ముందున్నారు..

టామ్ లాథమ్‌ను అత్యధిక సార్లు అవుట్ చేసిన భారత బౌలర్‌గా నిలిచిన అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్ (8 సార్లు) తర్వాత ఎక్కువ సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా (7 సార్లు) నిలిచాడు...

తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగులు చేసి అవుట్ అయిన టామ్ లాథమ్, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేసి భారత్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోరు చేసిన మూడో కివీస్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

ఇంతకుముందు 2003లో నాథన్ అస్లే, క్రెగ్ మెక్‌మిలాన్ ఈ ఫీట్ సాధించగా... 2010 తర్వాత భారత్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోరు చేసిన రెండో విదేశీ ఓపెనర్ టామ్ లాథమ్... 

80 టెస్టుల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ముత్తయ్య మురళీధరన్ 80 టెస్టుల తర్వాత 450 వికెట్లతో ఉండగా, అశ్విన్ 418, రిచర్డ్ హార్డ్‌లే 403, డేల్ స్టెయిన్ 402 వికెట్లతో టాప్ 4లో ఉన్నారు..

click me!