రాహుల్ ద్రావిడ్ తిట్టిన తర్వాతే ధోనీ మారాడు... టీమిండియాలోకి వచ్చిన కొత్తలో గంగూలీ అలా...

First Published | Nov 26, 2021, 3:28 PM IST

ఎమ్మెస్ ధోనీ... అదే పేరు కాదు, బ్రాండ్...  టీమిండియాలోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్‌గా కీర్తి గడించిన ఎమ్మెస్ ధోనీ విజయం వెనక భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడట. 

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్‌కోచ్ ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ చాలా కూల్ అండ్ కామ్... అవుటైనా కూడా కూల్‌గా నడుచుకుంటూ వెళ్లిపోతుంటాడు రాహుల్ ద్రావిడ్...

రాహుల్ ద్రావిడ్ కోపడ్డడం, కోపంగా అరవడం చాలా అరుదుగా చూసి ఉంటారు క్రికెట్ ఫ్యాన్స్. అందుకే అలాంటి రాహుల్ ద్రావిడ్‌ను కోపిస్టుగా చూపిస్తూ చేసిన ఓ యాడ్‌, బాగా హిట్టైంది...


అయితే మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాలోకి వచ్చిన కొత్తలో, రాహుల్ ద్రావిడ్‌ అతనిపై కోపడ్డాడని... ఆ మాటలే మాహీ ఆటతీరును మార్చి, మరింత మెరుగ్గా రాణించడానికి కారణమయ్యాయని అంటున్నాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...

‘రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో మహేంద్ర సింగ్ ధోనీకి ఫినిషర్ రోల్ ఇచ్చాడు. అయితే ఓ మ్యాచ్‌లో బ్యాడ్ షాట్ ఆడి, ధోనీ అవుట్ అయ్యాడు... అంతే ఆ రోజు ద్రావిడ్, ధోనీపై కోపడ్డాడు...

ఇంత నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తావా? నిన్ను నమ్మి నీకు ఫినిషర్ రోల్ ఇచ్చినప్పుడు ఆఖరిదాకా క్రీజులో ఉండి, మ్యాచ్‌ను ముగించాలి... ఇలాగేనా నువ్వు ఆడాల్సింది... అంటూ ద్రావిడ్ తిట్టాడు..

ద్రావిబ్ భాయ్ మాటల్లో నాకు సగం అర్థం కాలేదు కూడా. ఆ తర్వాతి మ్యాచ్‌లో మాహీ బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అనవసర షాట్లు ఆడకుండా డిఫెన్స్ ఆడడం గమనించా...

అతని దగ్గరికెళ్లి, ‘ఏమైంది ఇలా ఆడుతున్నావ్?  అని అడిగాను. దానికి ధోనీ, ‘మళ్లీ రాహుల్ భాయ్‌తో తిట్లు తినడం నాకు ఇష్టం లేదు, చివరి దాకా ఉండి మ్యాచ్ ఫినిష్ చేస్తా...’ అని చెప్పాడు...

రాహుల్ ద్రావిడ్ తిట్టిన తిట్ల కారణంగానే మహేంద్ర సింగ్ ధోనీకి డిఫెన్స్ విలువ కూడా తెలిసింది. చివరిదాకా ఉండి, మ్యాచ్‌ను ఫినిష్ చేయడం అలవాటు చేసుకున్నాడు... 

2005లో భారత జట్టు ఫించ్ హిట్టర్ల కోసం వెతుకున్న రోజుల్లో దాదా, ఎమ్మెస్ ధోనీకి వన్‌డౌన్‌లో మూడు, నాలుగు ఛాన్స్‌లు ఇవ్వాలని భావించాడు. అతను క్లిక్ అయితే ఓకే, లేదంటే మాహీ ప్లేస్‌లో వేరొకరిని ప్రయత్నించాలని భావించాడు...

అతికొద్ది మంది కెప్టెన్లు మాత్రమే అలా చేస్తారు. తొలుత అతను తన ఓపెనింగ్ ప్లేస్‌ని నా కోసం త్యాగం చేశాడు. ఆ తర్వాత ధోనీ కోసం బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేశాడు..

దాదా అలా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయకపోయి ఉంటే, ధోనీ అనే క్రికెటర్ ప్రపంచానికి తెలిసేవాడు కాదు. అలాగే ద్రావిడ్ ఆ రోజు తిట్టకపోయి ఉంటే, మాహీలో ఉన్న ఫినిషర్ బయటికి వచ్చేవాడు కాదు..’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...

Latest Videos

click me!