రోహిత్ శర్మ ఫిక్స్... హిట్‌మ్యాన్‌తో ఓపెనింగ్‌కి ఆ ముగ్గురి పోటీ... మయాంక్ అగర్వాల్ సెంచరీతో...

Published : Dec 03, 2021, 07:03 PM IST

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌, భారత జట్టుకి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఐదో స్థానంలో ఆరంగ్రేటం చేసిన శ్రేయాస్ అయ్యర్, తొలి టెస్టులో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ బాదడంతో అతని కోసం ఎవరిని తప్పించాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ సెంచరీతో ఓపెనింగ్ స్థానానికి పోటీ మరింత పెరిగిపోయింది...

PREV
113
రోహిత్ శర్మ ఫిక్స్... హిట్‌మ్యాన్‌తో ఓపెనింగ్‌కి ఆ ముగ్గురి పోటీ... మయాంక్ అగర్వాల్ సెంచరీతో...

కాన్పూర్ టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మయాంక్ అగర్వాల్‌, ముంబై టెస్టులో అద్భుత సెంచరీతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నిజానికి మయాంక్ అగర్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ, జట్టులోకి వస్తాడని ప్రచారం జరిగింది...

213

అయితే అజింకా రహానే, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ గాయపడడంతో లక్కీగా మయాంక్ అగర్వాల్, తన ప్లేస్‌ను కాపాడుకుని... వచ్చిన అవకాశాన్ని కరెక్టుగా వాడుకుంటూ సెంచరీతో చెలరేగాడు...

313

మొదటి రోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేస్తే, అందులో మయాంక్ అగర్వాల్ సాధించిన పరుగులే 120... శుబ్‌మన్ గిల్ 44 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

413

ఇప్పుడు రోహిత్ శర్మతో ఎవరిని ఓపెనర్‌‌గా పంపాలనేది టీమిండియాకి పెద్ద సమస్యగా మారనుంది. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వరుసగా విఫలమవుతుంటే, ఓపెనింగ్ ప్లేస్ కోసం పోటీ తీవ్రంగా పెరుగుతోంది...

513

రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తే, రెగ్యూలర్ ఓపెనర్‌గా అతని స్థానం మూడు ఫార్మాట్లలోనూ పదిలం. కాబట్టి రోహిత్‌ శర్మకు మరో ఎండ్‌లో ఎవరు ఆడాలనేది ఇప్పుడు కీలకంగా మారనుంది...

613

2019 వరకూ టీమిండియా టెస్టు ఓపెనర్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా టూర్‌లో వరుసగా రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. 

713

మెల్‌బోర్న్ టెస్టులో రాణించిన శుబ్‌మన్ గిల్‌తో కలిసి సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశాడు... ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన శుబ్‌మన్ గిల్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. 

813

అయినా అతని ఫామ్‌ ఆధారంగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు శుబ్‌మన్ గిల్... ఇంగ్లాండ్ టూర్‌కి ముందు శుబ్‌మన్ గిల్ గాయపడడంతో మయాంక్ అగర్వాల్‌ను తిరిగి ఓపెనర్‌గా పంపించాలని భావించింది టీమిండియా. అయితే తొలి టెస్టు ఆరంభానికి ముందు మయాంక్ అగర్వాల్ కూడా గాయపడ్డాడు...

913

దీంతో కెఎల్ రాహుల్ రెండేళ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మొదటి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మతో కలిసి శతాధిక భాగస్వామ్యం నమోదుచేయడంతో కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా కొనసాగించింది భారత జట్టు...

1013

తన తొలి టెస్టు సెంచరీనే ద్విశతకంగా మలిచిన మయాంక్ అగర్వాల్, 371 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లతో 215 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాపై వరుసగా రెండు సెంచరీలు చేసిన మయాంక్ అగర్వాల్, సెహ్వాగ్ తర్వాత ఈ రికార్డు క్రియేట్ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

1113

తన ఎనిమిదో టెస్టులోనే రెండో డబుల్ సెంచరీ బాదిన మయాంక్ అగర్వాల్, బ్రాడ్‌మన్ కంటే వేగంగా రెండు డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు...

1213


అత్యంత వేగంగా టెస్టుల్లో 1000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డు క్రియేట్ చేసిన మయాంక్ అగర్వాల్... రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ కారణంగా రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వస్తోంది...

1313

ఇప్పుడు మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా టూర్‌లో ఓపెనర్‌గా ఎవరిని ఆడిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు మరో ఎండ్‌లో ఆడేందుకు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ పోటీ పడాల్సి ఉంటుంది...

Read more Photos on
click me!

Recommended Stories